Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు, 8కి చేరిన మృతుల సంఖ్య

Assam Floods: అసోం నుంచి త్రిపుర, మిజోరం, మణిపూర్‌కు నిలిచిన రాకపోకలు

Rama Rao
Updated on: 18 May 2022 9:30 AM IST
Heavy Rains and Heavy Floods in Assam | National News
X

Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు, 8కి చేరిన మృతుల సంఖ్య

Assam Floods: అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే 4లక్షల మంది వరదలతో తీవ్ర ఇబ్బందులకు గురవ్వగా 8మంది మృతిచెందారు. వరదల ధాటికి పలుచోట్ల రోడ్లు, రైలు మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అసోం నుంచి త్రిపుర, మిజోరం, మణిపూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడి మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌తో అసోంకు సంబంధాలు తెగిపోయాయి. అసోంలో నేటినుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కాగా అసోంలో ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story