Rains: ఏపీ, తెలంగాణ జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షాలు

Heavy Rain In AP And Telangana
x

Rains: ఏపీ, తెలంగాణ జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షాలు

Highlights

Rains: విశాఖలో సాయంత్రానికి వర్షం పడే ఛాన్స్ ఉందన్న అధికారులు

Rains: AP, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలో మరో 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక వర్షాలు.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రుతుపవనాలకు ముందే అత్యధిక ఉష్ణోగ్రతలకుతోడు, ద్రోణుల ప్రభావం ఎక్కువగా కూడా ఉండటంతో తెలంగాణలో వడగండ్ల వర్షం పడుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో భారత్ వన్డే మ్యాచ్ కొనసాగుతున్న విశాఖలో వాతావరణంపై అందరి ఫోకస్ నెలకొంది. ప్రస్తుతం విశాఖలో పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ.. సాయంత్రానికి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories