Supreme Court: సీఏఏ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Hearing on CAA Petitions in Supreme Court today
x

Supreme Court: సీఏఏ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Highlights

Supreme Court: సీఏఏను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు

Supreme Court: దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయొద్దంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సీఏఏ అమలుపై స్టే విధించాలంటూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈ నెల 12న కోర్టును ఆశ్రయించింది. 2019 నుంచి ఇప్పటివరకు దాఖలైన 195 పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మరో వైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories