logo
జాతీయం

హత్రాస్ సాకుతో అల్లర్లకు కుట్ర : ఉగ్రవాద సంస్థకు రూ.100 కోట్ల..

హత్రాస్ సాకుతో అల్లర్లకు కుట్ర : ఉగ్రవాద సంస్థకు రూ.100 కోట్ల..
X
Highlights

హత్రాస్‌లో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన సాకుతో అల్లర్లు వ్యాప్తి చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పాపులర్..

హత్రాస్‌లో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన సాకుతో అల్లర్లు వ్యాప్తి చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) అనే ఉగ్రవాద సంస్థ గురించి కొత్త సమాచారం వెలువడింది. హత్రాస్ ఘటన సాకుతో యుపిలో జాతి వ్యతిరేక అల్లర్లను వ్యాప్తి చేయడానికి పిఎఫ్‌ఐకి 100 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని, అందులో 50 కోట్లు మారిషస్ నుంచి వచ్చాయని వర్గాలు తెలిపాయి. ఢిల్లీ నుంచి హత్రాస్‌కు వెళ్తున్న నలుగురు కార్యకర్తలను మథురలో మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. వారి వద్ద 6 స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, జస్టిస్ ఫర్ హత్రాస్ బాధితుడు' అనే ప్లకార్డ్‌ ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా వీరిని స్థానిక కోర్టు నలుగురు నిందితులను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ప్రాథమిక దర్యాప్తులో నలుగురు నిందితులకు వెబ్‌సైట్ జస్టిస్ ఫర్ హత్రాస్‌తో సంబంధం ఉందని, ఈ ముఠా అల్లర్లను వ్యాప్తి చేసి, తప్పించుకోవడానికి ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అల్లర్లను ప్రేరేపించడానికి విదేశాల నుండి నిధులు సమకూరుతాయని పోలీసులు తెలుసుకున్నారు. ఈ వ్యక్తులతో సంబంధం ఉన్న సంస్థలు మరియు కార్యకర్తలు జనసమూహాలను సేకరించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, నిధులు సేకరించడం.. బాధితులకు న్యాయం అందించడం అనే ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం జరుగుతుందని కనుగొన్నారు. కాగా ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఎవరు ఏర్పాటు చేశారు, ఏ ప్రయోజనం కోసం చేస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Web Titlehathras rape case latest news pfi activists arrest mathura
Next Story