
Haryana Government: 24 గంటల్లో రూ.590 కోట్ల రికవరీ చేసిన హర్యానా సర్కార్.. ఐడీఎఫ్సీ బ్యాంక్ స్కామ్ గుట్టురట్టు!
ఐడీఎఫ్సీ బ్యాంక్ మోసంపై వేగంగా చర్యలు తీసుకున్న హర్యానా ప్రభుత్వం.. 24 గంటల్లోనే రూ.590 కోట్లు రికవరీ చేసి సంచలనం సృష్టించింది!
హర్యానాలో సంచలనం సృష్టించిన రూ.590 కోట్ల ఐడీఎఫ్సీ (IDFC) ఫస్ట్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రభుత్వం మెరుపు వేగంతో స్పందించింది. హర్యానా ప్రభుత్వానికి చెందిన కొన్ని శాఖల నిధులు చండీగఢ్‌లోని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఉన్నాయి. అయితే, ఆ బ్యాంకులోని కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి తెలియకుండానే దాదాపు రూ.590 కోట్లను పక్కదారి పట్టించారు. ప్రభుత్వం తమ ఖాతాలను వేరే బ్యాంకుకు మార్చాలని కోరినప్పుడు, బ్యాంక్ రికార్డుల్లో ఉన్న డబ్బుకు, ప్రభుత్వ లెక్కల్లో ఉన్న డబ్బుకు తేడా రావడంతో ఈ మోసం బయటపడింది.
ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నయాబ్ సైనీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. బ్యాంకుపై ఒత్తిడి తెచ్చి, కేవలం ఒకే ఒక్క రోజులో రూ.556 కోట్లను వడ్డీతో (సుమారు రూ.25 కోట్లు) సహా రికవరీ చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తన ఇతర బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయించుకుంది. ఈ భారీ మోసంపై పూర్తిస్థాయి విచారణ కోసం ప్రభుత్వం ACBకు కేసును అప్పగించింది. అలాగే దీనిపై ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీని కూడా వేశారు. ఇందులో కేవలం బ్యాంకు ఉద్యోగులే ఉన్నారా? లేక ప్రభుత్వ విభాగాల సిబ్బంది ఎవరైనా వీరికి సహకరించారా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి నయాబ్ సైనీ వివరణ ఇవే..
అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. "ప్రభుత్వ నిధులు చాలా కాలంగా బ్యాంకుల్లో నిలిచిపోయాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి ఖాతాలను సరిచూసుకోగా, నిధులు పక్కదారి పట్టినట్లు తెలిసింది. వెంటనే బ్యాంకును హెచ్చరించి, ఖాతాలు మూసివేయమని ఆదేశించాం. ప్రజల సొమ్మును వడ్డీతో సహా తిరిగి రాబట్టాం" అని తెలిపారు. మొత్తానికి, ప్రభుత్వ అప్రమత్తత వల్ల వందల కోట్ల ప్రజా ధనం అక్రమాల జేబుల్లోకి వెళ్లకుండా తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుకుంది. ఈకేసును బ్యాంకు
- IDFC First Bank Scam Haryana
- Haryana Government Fund Recovery
- Nayab Saini Bank Scam Update
- ACB Investigation Haryana Bank Scam
- Public money recovery Haryana
- Bank employee fraud Haryana government accounts
- IDFC First Bank regulatory filing fraud
- Finance Secretary Committee Haryana Scam
- Haryana Assembly CM speech on bank funds
- ₹590 Crore Bank Fraud Chandigarh

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




