Top
logo

'నా భర్త కనిపించడం లేదు' : హార్దిక్ పటేల్ భార్య

Highlights

పాటిదార్ కమ్యూనిటీ నాయకుడు హార్దిక్ పటేల్ గత 20 రోజులుగా కనిపించడం లేదని గుజరాత్ ప్రభుత్వం తన భర్తను లక్ష్యంగా...

పాటిదార్ కమ్యూనిటీ నాయకుడు హార్దిక్ పటేల్ గత 20 రోజులుగా కనిపించడం లేదని గుజరాత్ ప్రభుత్వం తన భర్తను లక్ష్యంగా చేసుకుందని అతని భార్య కింజాల్ పటేల్ ఆరోపించారు. "గత 20 రోజులుగా నా భర్త తప్పిపోయాడు, ఆయన ఆచూకీ గురించి మాకు సమాచారం లేదు. ఆయన కనిపించకపోవడం పట్ల మాకు తీవ్ర బాధ ఉంది.. ప్రజలు కూడా గమనించాలి' అని కింజల్ ఒక వీడియోలో పంచుకున్నారు.

అంతేకాదు "2017 లో, పాటిదార్లపై ఉన్న అన్ని కేసులను తిరిగి తీసుకుంటామని ఈ ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు వారు హార్దిక్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, బిజెపిలో చేరిన పాటిదార్ ఉద్యమంలోని మరో ఇద్దరు నాయకులు ఇందులో ఎందుకు లేరు" అని ఆమె ప్రశ్నించారు. "హార్దిక్ ప్రజలను కలవడం వారి కష్టసుఖాలను పంచుకోవడం.. ప్రజల సమస్యలను లేవనెత్తడం వంటి అంశాల్లో పోరాటం చెయ్యడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు అందువల్లే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని కింజల్ చెప్పారు.

కాగా హార్దిక్ పటేల్ ఆచూకీ ఇంకా వెల్లడికాలేదు, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన అభినందించారు. ఈ మేరకు ఫిబ్రవరి 11 న ట్విట్టర్‌లో తన సందేశాన్ని ఇచ్చాడు. అంతకంటే ముందు.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున గుజరాత్ ప్రభుత్వం తనను జైలులో బంధించడానికి ప్రయత్నిస్తోందని ఫిబ్రవరి 10 న సోషల్ మీడియా ద్వారా పటేల్ ఆరోపించారు.

ఆ సందర్బంగా పటేల్ తన ట్వీట్‌లో.. "నాలుగేళ్ల క్రితం గుజరాత్ పోలీసులు నాపై తప్పుడు కేసు పెట్టారు, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నేను అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్‌ను నాపై కేసుల వివరాలను అడిగాను, కాని ఆ సమయంలో తనపై ఈ కేసు లేదని చెప్పారు.. అయినా కూడా ఈ కేసుకు సంబంధించి తనను కస్టడీలోకి తీసుకునేందుకు తన ఇంటికి పోలీసులు వచ్చారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని ఆ ట్వీట్‌లో హార్దిక్ పటేల్‌ పేర్కొన్నారు.

అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. నాపై అనేక బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేశారు. గుజరాత్లో పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, అందుకే నన్ను జైలులో బంధించాలని బిజెపి కోరుకుంటుంది. నేను బిజెపికి వ్యతిరేకంగా ప్రజల పోరాటాన్ని కొనసాగిస్తాను. త్వరలో కలుస్తాను, జై హింద్ అంటూ రెండో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం హార్దిక్ పటేల్ అజ్ఞాతంలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

Web TitleHardik Patel missing for last 20 days claims wife Kinjal
Next Story

లైవ్ టీవి


Share it