ఒక్కరోజు ఆగివుంటే ఆ ప్రకటన నిర్భయ దోషులను ఉరి నుంచి తప్పించేదా?

ఒక్కరోజు ఆగివుంటే ఆ ప్రకటన నిర్భయ దోషులను ఉరి నుంచి తప్పించేదా?
x
Highlights

ఐక్యరాజ్య సమితి (యుఎన్) కీలక ప్రకటన తీసుకుంది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు...

ఐక్యరాజ్య సమితి (యుఎన్) కీలక ప్రకటన తీసుకుంది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్‌, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఉరిశిక్షపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సామూహిక అత్యాచారం మరియు 23 ఏళ్ల నిర్భయ అనే యువతిని హత్య చేసినందుకు దోషులుగా తేలిన నలుగురికి ఉరి తీసిన ఒక రోజు తర్వాత, మరణశిక్ష విధించడాన్ని ఆపాలని లేదా దానిపై తాత్కాలిక నిషేధం విధించాలని యుఎన్ అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. దీనిపై స్టిఫానే డుజారిక్ మాట్లాడుతూ..

"మా నిర్ణయం స్పష్టంగా ఉంది, మరణశిక్ష వాడకాన్ని నిలిపివేయాలని లేదా కనీసం దీనిపై తాత్కాలిక నిషేధాన్ని ఉంచాలని మేము అన్ని రాష్ట్రాలను పిలుస్తున్నాము" అని డుజారిక్ శుక్రవారం రోజువారీ విలేకరుల సమావేశంలో అన్నారు. కాగా నిర్భయను సామూహిక అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. 16,000 మందికి పైగా ఖైదీలను కలిగి ఉన్న దక్షిణ ఆసియాలోని అతిపెద్ద జైలు సముదాయం అయిన తీహార్ జైలులో నలుగురిని ఒకేసారి ఉరి తీయడం ఇదే మొదటిసారి.

ఉరి నుండి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చట్టబద్ధమైన ప్రతి మార్గాన్ని ఉపయోగించుకున్న తరువాత మరణశిక్షలు అమలు చేశారు. వాస్తవానికి వారికి జనవరి 22 న ఉరిశిక్ష యొక్క మొదటి తేదీని నిర్ణయించినా.. రెండు నెలల పాటు అనివార్యంగా వాయిదా పడుతూ వచ్చింది. నలుగురు దోషుల ఉరిశిక్ష భారతదేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచాన్ని కూడా కదిలించింది. ఈ కేసుపై శిక్ష అమలు కూడా ఆలస్యం అవ్వడాన్ని కూడా కొందరు తప్పుబట్టారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు తరువాత వారికి మరణశిక్ష విధించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరాస్‌ హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదన్నారు. ఈ మహమ్మారికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వెయ్యాలని నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు కోల్పోతారని వివిధ దేశాలను ఆయన హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories