ప్రార్థనల సంధర్బంగా ఢిల్లీలోని గురుగ్రామ్‌లో హై అలర్ట్

ప్రార్థనల సంధర్బంగా ఢిల్లీలోని గురుగ్రామ్‌లో హై అలర్ట్
x
Highlights

ఈ రోజు శుక్రవారం ప్రార్థనల సంధర్బంగా ఢిల్లీలోని గురుగ్రామ్‌లో హై అలర్ట్ జారీ చేశారు పోలీసులు.. ఈ ప్రాంతంలోని గుళ్ళు, మసీదుల తో పాటు బహిరంగ...

ఈ రోజు శుక్రవారం ప్రార్థనల సంధర్బంగా ఢిల్లీలోని గురుగ్రామ్‌లో హై అలర్ట్ జారీ చేశారు పోలీసులు.. ఈ ప్రాంతంలోని గుళ్ళు, మసీదుల తో పాటు బహిరంగ ప్రదేశాల్లో పోలీసులను భారీగా మోహరించారు. అనుమానితులను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ముస్లింలు తమ ప్రార్ధనలు ముగించుకొని నేరుగా ఇళ్లకే చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అల్లర్లలో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాకాండలో మహిళలపై జరిగిన దాడులను పరిశీలించడానికి చైర్‌పర్సన్ రేఖ శర్మతో సహా జాతీయ మహిళా కమిషన్ బృందం శుక్రవారం జాఫ్రాబాద్‌ను సందర్శిస్తుందని ఒక సభ్యురాలు తెలిపారు.

కాగా మూడు రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో పౌరసత్వ చట్ట మద్దతుదారులు మరియు నిరసనకారుల మధ్య హింసాకాండ చెలరేగింది.. దీంతో 38 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. వారిలో దాదాపు 45 మంది దాకా పోలీసులు ఉన్నారు. గాయపడిన వారంతా ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక అల్లర్ల ప్రభావిత ప్రాంతాలు జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, చంద్ బాగ్, ఖురేజీ ఖాస్ మరియు భజన్‌పురా ఉన్నాయి. శుక్రవారం ఉదయం చంద్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ ఓపి మిశ్రా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇక్కడ సాధారణ పరిస్థితులు ఉన్నాయని.. ఎటువంటి అల్లర్లు జరగడం లేదని స్పష్టం చేశారు. అలాగే ముందుజాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించినట్టు తెలిపారు.

మంగళవారం అల్లర్లకు గురైన ప్రాంతాల నుండి పెద్ద సంఘటనలు జరగలేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.. నగరంలోని హింసాత్మక ప్రాంతాలలో పరిస్థితిని హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. ఐబి కి చెందిన ఉద్యోగిపై హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుండి పోలీసు దర్యాప్తు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రస్తుతం అతనిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఈ హత్యపై నేడో రేపో కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories