ముగిసిన గుజరాత్‌ పోలింగ్‌.. కాసేపట్లో విడుదల కానున్న ఎగ్జిట్‌ పోల్స్..

Exit Poll Results: గుజరాత్‌ పోలింగ్‌ ముగిసింది.

Arun Chilukuri
Published on: 5 Dec 2022 5:06 PM IST
Gujarat Assembly Election Exit Poll Results to be Announced Soon
X

ముగిసిన గుజరాత్‌ పోలింగ్‌.. కాసేపట్లో విడుదల కానున్న ఎగ్జిట్‌ పోల్స్..

Exit Poll Results: గుజరాత్‌ పోలింగ్‌ ముగిసింది. రెండు విడతలుగా ఈ ఎన్నికలు జరగగా.. ఫస్ట్‌ ఫేజ్‌లో 89 స్థానాలకు, సెకండ్‌ ఫేజ్‌లో 93 స్థానాలకు పోలింగ్ జరిగింది. బరిలో మొత్తం 833 మంది అభ్యర్థులు నిలవగా బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. దీంతో కాసేపట్లో విడుదల కానున్న ఎగ్జిట్‌ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గుజరాత్‌లో మరోసారి బీజేపీ పాగాపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అటు.. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఒకే విడతలో ఎలక్షన్స్‌ జరిగాయి. 68 స్థానాలకు నవంబర్‌ 12న పోలింగ్‌ జరిగింది. డిసెంబర్‌ 8న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ సంప్రదాయం కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story