Top
logo

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో గ్రెనైడ్ దాడి

Grenade Attack in Jammu Kashmir
X

జమ్మూ కాశ్మీర్లో గ్రెనేడ్ దాడి (ఫైల్ ఇమేజ్)

Highlights

Jammu and Kashmir: ముగ్గురు భద్రతా సిబ్బందికి తీవ్రగాయాలు

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లి జిల్లా కేంద్రంలో భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు భద్రతా సిబ్బందిపైకి గ్రెనైడ్ విసరడంతో ఇద్దరు CRPF జవాన్లతో పాటు ఓ పోలీస్ అధికారికి తీవ్రగాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర సీఎస్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరగాల్సి ఉంది.. ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. దాడి జరగడంతో సమావేశాం వాయిదా వేశారు.. భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహలు చేస్తున్నారు. మరోవైపు.. సాంబా జిల్లాలలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను జమ్మూకశ్మీర్ పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Web TitleGrenade Attack in Jammu Kashmir
Next Story