మహారాష్ట్ర గవర్నర్ కీలక నిర‌్ణయం

Bhagat Singh Koshiyari invites Devendra Fadnavis
x
Bhagat Singh Koshiyari invites Devendra Fadnavis
Highlights

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఎన్నికల్లో బీజేపీ - శివసేన కూటమిగా పోటీ చేశాయి. అయితే ఫలితాల అనంతరం ఇరు...

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఎన్నికల్లో బీజేపీ - శివసేన కూటమిగా పోటీ చేశాయి. అయితే ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పొత్తు కుదరలేదు. శివసేన ప్రతిపాదించిన ఫిఫ్టీ- ఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ అంగీకరించలేదు. దీంతో శివసేన వెనక్కి తగ్గింది. ఆపార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎంపీ సంజయ్ ప్రత్యర్థిపార్టీ ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ని కూడా కలిశారు. శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పలు కీలక వాఖ్యలు చేశారు. దీంతో మహారాష్ట రాజకీయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఫడ్నవిస్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సర్పించారు. ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్‌ కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఫలితాల్లో అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. నవంబర్‌ 11 తేదీ సోమవారంలోపు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య బలాన్ని నిరూపించుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్‌ నుంచి ఓ ప్రకటన జారీ చేశారు. అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి గవర్నర్‌ ఆ పార్టీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ- శివసేన కూటమి 162 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్సీపీ 54 కాంగ్రెస్‌ 44 సీట్లు ఇతరులు 21స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం తమపార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీవైపు చూడకుండా ఉండలాని ఆ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెర లేపిందని ఆరోపణలు వచ్చాయి. దానిని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. బల పరీక్ష నేపథ్యంలో పలువురు రెబల్ ఎమ్మెల్యేలపై బీజేపీ గాలం వేయాలని భావిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories