మర్కజ్ నుంచి వారిని ఖాళీ చేయించాం

మర్కజ్ నుంచి వారిని ఖాళీ చేయించాం
x
Highlights

దేశంలో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధ‌వారం ఒక్క‌రోజు 193 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదైయ్యాయి.

దేశంలో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధ‌వారం ఒక్క‌రోజు 193 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదైయ్యాయి. ఇప్ప‌టివ‌రకు ఈ మ‌హమ్మారి బారిన ప‌డి 52 మంది మ‌ర‌ణించారు. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా బాధితులు పెరిగిపోతున్నారు. ఏపీలో 87 కేస‌లు న‌మోదైతే , తెలంగాణ‌లో కూడా క‌రోనా కేసులు భారీగా పెరిగాయి.

ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ సమావేశాలకు ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారికి క‌రోనా సోక‌డంతో వారి వివ‌రాలు సేక‌రించేప‌నిలో రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిమ‌గ్నం అయ్యయి. ఈ నేపథ్యంలో కరోనా ఉత్పాతానికి కేంద్రమైన మసీదు నుంచి మొత్తం 2361 మందిని బ‌య‌ట‌కు పంపినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1830 మంది మార్చి 15-17 తేదీల్లో మర్కజ్‌ను సందర్శించినట్టు ఢి ల్లీ అధికారులు గుర్తించారు.

తబ్లీగీ జమాత్‌కు హాజరైన కనీసం 3,200 మందిని గుర్తించేందుకు 11 రాష్ట్ర ప్ర్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అహోరాత్రాలు కృషి చేస్తున్నాయి. నిజాముద్దీన్ మర్కజ్ లో ఉన్న‌వారిని ఈ తెల్లవారుజామున 4 గంటలకు బయటకు తెచ్చామని మ‌నీశ్ తెలిపారు. ఎందరో వైద్య సిబ్బంది, పోలీసులు, డీటీసీ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా ఒడ్డి ఈ ఆపరేషన్ పూర్తి చేశారని సిసోడియా తెలిపారు. మార్చి 19న‌ రిజిస్టర్ చేసుకోనివారు ఎందరో మర్కజ్‌ను సందర్శించార‌ని ప‌లు రాష్ట్ర‌లు అంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories