వాహనదారులకు ఊరట..ఫాస్టాగ్‌ గడువు పొడిగింపు

వాహనదారులకు ఊరట..ఫాస్టాగ్‌ గడువు పొడిగింపు
x
Central Government Extends FASTags
Highlights

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఊరట కలిగించే వార్తనిచ్చింది. ప్రధాన రహదారులపై డిసెంబర్ ఒకటి నుంచి వరకు ఉన్న ఫాస్టాగ్‌ గడువును డిసెంబర్‌ 15 వరకు...

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఊరట కలిగించే వార్తనిచ్చింది. ప్రధాన రహదారులపై డిసెంబర్ ఒకటి నుంచి వరకు ఉన్న ఫాస్టాగ్‌ గడువును డిసెంబర్‌ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై ప్రయాణించే అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉండాల్సిందేనని గతంలో కేంద్రం ప్రకటించింది. కాగా ఆ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

టోల్ ప్లాజా వద్ద గంటల తరబడి ఆగి టోల్ ను కట్టి వె‌ళతారు వాహనదారులు. అయితే ఇలా వారు ప్రయాణించే దారిలో అన్ని టోల్ ప్లాజాలు టాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా చేస్తున్నారు జాతీయ రహదారుల సంస్థ అధికారులు. ఇక మీదట టోల్ గేట్ వద్ద గంటల తరబడి ఆగి టోల్ కట్టవలసిన అవసరం ఉండదు. డిసెంబర్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్‌గేట్ల వద్ద 'ఫాస్టాగ్‌' అమలు చేయనున్నామని జాతీయ రహదారుల అధికారులు తెలిపారు. ఇప్పుడు ఆ గడుపు 15 వరుకు పొడిగించారు. ప్రతి వాహనదారుని వాహనానికి ఫాస్టాగ్‌ను అమర్చి. ఈ టాగ్‌ను బ్యాంక్‌ అకౌంట్‌కు అనుసంధానం చేస్తామని గతంలోనే అధికారులు తెలిపారు. దాంతో మొబైల్‌ వాలెట్‌ లేదా ప్రత్యేక కౌంటర్‌లలో ఫాస్టాగ్‌ను రీచార్జ్‌ చేసుకును అవకాశం ఉంటుంది. దింతో టోల్ ప్లాజా వద్ద నిరీక్షించే సమయం ఉండదు.

ఈ పద్ధతిని భారీ వాహనాలకు కూడా అనుసంధానం చేయనున్నారు. ఈ పద్ధతి ద్వారా వాహనాలు ఏ టోల్ ప్లాజాను దాటాయన్న సమాచారం కూడా అందుతుంది. ఈ విషయాలపై వాహనదారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సిబ్బంధిని టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేశారు. వాహనదారులు ఈ ఫాస్టాగ్ యాప్ ద్వారా దీన్ని వినియోగిచుకోవచ్చు. నవంబర్‌ 21వ తేదీ నుంచి ట్యాగ్‌ ఖర్చులో వెసులుబాటు తీసుకొచ్చినప్పటి నుంచి వినియోగం పెరిపోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories