రూ. 30కే చికెన్ మీల్స్.. ఎగబడ్డ జనం.. భారీగా ట్రాఫిక్ జామ్

రూ. 30కే చికెన్ మీల్స్.. ఎగబడ్డ జనం.. భారీగా ట్రాఫిక్ జామ్
x
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో మాంసం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.. అందునా చికెన్ ధరలు అయితే చెప్పనక్కర్లేదు.. రోజూ ముక్కలేడిది ముద్ద దిగని చికెన్ ప్రియులు కూడా...

కరోనా వైరస్ ప్రభావంతో మాంసం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.. అందునా చికెన్ ధరలు అయితే చెప్పనక్కర్లేదు.. రోజూ ముక్కలేడిది ముద్ద దిగని చికెన్ ప్రియులు కూడా పప్పూ, సాంబారు తో సరిపెట్టుకుంటున్నారు. చికెన్ తింటే ఎక్కడ కరోనావైరస్ సోకుతుందో అన్న ప్రచార భయంతో నాలుక పీకుతున్నా నోరు కట్టేసుకుంటున్నారు. దీంతో తినే వాళ్ళు లేక కొన్ని హోటళ్లు అయితే చికెన్ వంటకాలు వండటం మానేస్తున్నాయి. ఈ పుకార్లతో పౌల్ట్రీ రంగం కుప్పకూలిపోయింది. వాస్తవానికి చికెన్‌ తింటే కరోనా వైరస్‌ వస్తుందన్న వార్తల్లో నిజం లేదని, వైద్యులు స్పష్టం చేస్తున్నారు.. అంతేకాదు కరోనా వైరస్ కు చికెన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని శాస్త్రవేత్తలు కూడా తేల్చి చెప్పారు. చికెన్‌, గుడ్లు తినడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందదని చెబుతున్నారు.

అలాగే తాము తిని.. ప్రజల్ని కూడా చికెన్ తినమని రాజకీయ నాయకులు ప్రోత్సాహిస్తున్నారు.. అయినా జనంలో ఆ అపోహా ఆవహించింది. దీంతో వారిలో భయాన్ని పోగేట్టేందుకు ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పౌల్ట్రీఫామ్‌ అసోసియేషన్‌ ఓ నిర్ణయానికి వచ్చింది. చికెన్ తింటే కరోనా వైరస్ రాదు అని వివరిస్తూ.. శనివారం భారీ చికెన్ మేళాకు తెరతీసింది. ఈ చికెన్ మేళాలో వివిధ రకాల ఐటమ్స్ ను చేర్చింది. ఏ ఐటెం తిన్నా కేవలం ప్లేటు రూ. 30 లే అని ప్రకటించింది. ఈ క్రమంలో గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ ముందు రూ. 30కే చికెన్‌ మీల్స్‌ పెట్టింది. దీంతో జనం వేలం వెర్రిగా తిన్నారు. దీని ప్రభావంతో ఆ రోడ్డుపై గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది. రైల్వే స్టేషన్‌లోని జనం మొత్తం చికెన్‌ కోసం రోడ్డు మీదకు రావడంతో స్టేషన్‌ మొత్తం ఖాళీగా మారింది. చికెన్, మటన్ లేదా చేపలు తినడం వల్ల కోరోనవైరస్ రాదు అని వారికి వివరించడం కోసమే ఈ మేళాను నిర్వహించినట్టు పౌల్ట్రీఫామ్‌ అసోసియేషన్‌ తెలిపింది. ప్రజలు దైర్యంగా చికెన్ వంటకాలు తిన్నారని.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories