ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్‌.. కొత్త ఏడాదిలో సుకన్య సమృద్ధి పథకంపై 7.6 శాతం వడ్డీ..

Good News for Parents of Girls‌ 7.6 Per Cent Interest on Sukanya Samridhi Scheme in New Year
x

ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్‌.. కొత్త ఏడాదిలో సుకన్య సమృద్ధి పథకంపై 7.6 శాతం వడ్డీ..

Highlights

ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్‌.. కొత్త ఏడాదిలో సుకన్య సమృద్ధి పథకంపై 7.6 శాతం వడ్డీ..

Sukanya Samridhi yojana: సుకన్న సమృద్ది యోజన పథకం ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకం. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇందులో పదేళ్ల లోపు ఆడపిల్లల పేరుపై అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇది పోస్టాఫీసులో లేదా ఏదైనా దగ్గరలోని బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్ చేయవచ్చు. ఇందులో పొదుపు చేసే డబ్బులపై ప్రభుత్వం అధిక వడ్డీని చెల్లిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీలో మార్పులు చేస్తుంది. కొత్త సంవత్సరంలో ఈ పథకంపై వడ్డీని 7.6శాతంగా నిర్ణయించారు.

సుకన్య సమృద్ధి యోజన పథకం తక్కువ పొదుపులో ఎక్కువ రాబడిని పొందే అవకాశాన్ని ఇస్తుంది. కూతురికి 18 ఏళ్లు వచ్చేసరికి పై చదువుల ఖర్చులకో, పెళ్లికో డబ్బు టెన్షన్ ఉండదు. తర్వాత కూతురు పెద్దయ్యాక సంపాదించడం ప్రారంభించినప్పుడు ఆమె ఈ ఖాతాను ఉపయోగించుకోవచ్చు. మీరు కొత్త సంవత్సరంలో కూతురికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజన ఉత్తమ పథకం అని చెప్పవచ్చు.ఈ పథకాన్ని 2015లో 'బేటీ బచావో-బేటీ పఢావో' ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఇందులో 250 రూపాయలతో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయడానికి మినహాయింపు ఉంటుంది. విశేషమేమిటంటే కూతురు పేరు మీద సుకన్య సమృద్ధి యోజనలో డబ్బు డిపాజిట్ చేసిన తండ్రికి ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఒకవైపు కూతురి భవిష్యత్తు భద్రంగా ఉంటే మరోవైపు తండ్రికి పొదుపు చేసే సౌకర్యం కూడా కలుగుతుంది. ఉదాహరణకు మీ కుమార్తెకు ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే మీరు ఆమె పేరుపై సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచారు అనుకుందాం. ఆమె ఖాతాలో ప్రతి నెలా 5 వేలు జమచేస్తే ఏడాదికి 60 వేల రూపాయలు వస్తాయి. 2021లో ఖాతా తెరిస్తే అది 21 ఏళ్లలో అంటే 2041లో మెచ్యూర్ అయి కూతురి పేరు మీద జమ చేసిన డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories