రోజురోజుకీ పెరుగుతున్న బంగారం ధర

Gold Price Is Increasing Day By Day
x

రోజురోజుకీ పెరుగుతున్న బంగారం ధర

Highlights

* హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం రూ.62,650

Gold Price: బులియన్‌ మార్కెట్లో బంగారం ధగధగలాడుతోంది. ఏ రోజుకారోజు కొత్త రికార్డులతో హోరెత్తి స్తోంది. బంగారం, వెండి ధరలు సగటు ప్రజలకు అందని స్థాయిలో దూసుకుపోతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గురువారం 62వేలు దాటిపోయింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో మరో ఆల్‌టైమ్‌ హై కి బంగారం దర చేరుకొంది. హైదరాబాద్ లో 62,650 రూపాయలు పలుకుతోంది.బుధవారంతో పొలిస్తే 13 వందల 40 రూపాయల ఎక్కువ.

పసిడి ధర చుక్కలంటడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మార్చి నెలలో అమెరికాలో ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో పెరగక పోవడం, ఫెడ్‌ రిజర్వు వడ్డీరేట్లు ఇక దూకుడుగా పెంచకపోవచ్చన్న అంచనాలు, అధిక ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరిసిస్తోందన్న వార్తలు ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరితో పోలిస్తే దేశీయ మార్కెట్‌లో పసిడి ధర ఏడు శాతం పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకంరేటు బక్కచిక్కడం కూడా మరో ప్రధాన కారణం.ఫ్యూచర్స్‌ మార్కెట్‌లోనూ పసిడి ధర దూసుకుపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories