గోఎయిర్ విమానాల టికెట్ల బుకింగ్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం

గోఎయిర్ విమానాల టికెట్ల బుకింగ్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం
x
Highlights

ప్రముఖ ఏవియేషన్ సంస్థ గోఎయిర్ ఏప్రిల్ 15 నుండి దేశీయ విమానాల టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ ఏవియేషన్ సంస్థ గోఎయిర్ ఏప్రిల్ 15 నుండి దేశీయ విమానాల టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 14 న 21 రోజుల లాక్డౌన్ ముగిసిన తరువాత ప్రభుత్వం దేశీయ మరియు విదేశాలకు దశలవారీగా ప్రయాణికులను తరలిస్తుందని వస్తున్న ఊహాగానాలను పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గోఎయిర్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

గోయిర్ ప్రతినిధి వార్తా సంస్థ ANI తోమాట్లాడుతూ ఇలా అన్నారు.. "గోయిర్ 15 ఏప్రిల్ 2020 నుండి దేశీయ విమానాల్లో ప్రయాణానికి సంబంధించి బుకింగ్ చేసుకోవచ్చు.. అంతర్జాతీయ విమానాల బుకింగ్.. మే 1 నుండి ప్రారంభం అవుతుందని చెప్పారు..

గత వారంలోనే, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిర్ ఇండియా ఏప్రిల్ 30 వరకు ముందస్తు బుకింగ్ ఆపివేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మార్చి 25 న 21 రోజుల లాక్‌డౌన్ అమలు చేశారు. ఈ క్రమంలో రైళ్లు, విమానాల కదలికను కూడా నిషేధించారు. లాక్డౌన్ కు ముందే, చాలా విమానయాన సంస్థలు ప్రయాణీకులు తక్కువగా ఉన్నందున విమానాలను రద్దు చేశాయి.

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోన్న తరుణంలో భారత విమానయాన సంస్థ అంతర్జాతీయ విమానాలను మార్చి 22 వరకు ఒక వారంపాటు నిలిపివేసింది. తరువాత దాన్ని లాక్‌డౌన్ వరకు విస్తరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories