Global hunger index :107 దేశాల ర్యాంకింగ్‌లో భారత్ స్థానం చూస్తే..

Global hunger index :107 దేశాల ర్యాంకింగ్‌లో భారత్ స్థానం చూస్తే..
x
Highlights

107 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో, ఈ ఏడాది 94 వ స్థానంలో ఉన్న భారత్ సీరియస్ విభాగంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి మరియు పోషకాహార..

107 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో, ఈ ఏడాది 94 వ స్థానంలో ఉన్న భారత్ సీరియస్ విభాగంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి మరియు పోషకాహార లోపం యొక్క స్థితిని పర్యవేక్షించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్‌సైట్ ఈ నివేదికను విడుదల చేసింది, ఇది శనివారం బయటకు వచ్చింది. పోషకాహార లోపం తోపాటు పెద్ద రాష్ట్రాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల భారతదేశం ర్యాంకింగ్ ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు.

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు మయన్మార్‌లు కూడా సీరియస్ విభాగంలో ఉన్నాయి, అయితే ఇవి భారతదేశం కంటే తక్కువ స్థానంలో ఉన్నాయి.. బంగ్లాదేశ్ 75 వ స్థానంలో ఉండగా, మయన్మార్ 78, పాకిస్తాన్ 88వ స్థానంలో ఉన్నాయి. నేపాల్ 73 వ ర్యాంకుతో మోడరేట్ హంగర్ విభాగంలో ఉంది. ఇదే విభాగంలో శ్రీలంక 64వ స్థానంలో ఉంది. ఇక భారతదేశం వెనుక 13 దేశాలు మాత్రమే ఉన్నాయి, వీటిలో రువాండా (97), నైజీరియా (98), ఆఫ్ఘనిస్తాన్ (99), లిబియా (102), మొజాంబిక్ (103), చాడ్ (107) స్థానాల్లో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా 31 దేశాలు సీరియస్ విభాగంలో ఉన్నాయి. అవి ఇవే..

*ఈశ్వతిని

*బంగ్లాదేశ్

*కంబోడియా

*గ్వాటెమాల

*మయన్మార్

*బెనిన్

*బోస్ట్వానా

*మాలావి

*మాలి

*వెనిజులా

*కెన్యా

*మౌరిటియానా

*కోట్ డి ఐవోరీ

*పాకిస్తాన్

*టాంజానియా

*బుర్కినా ఫాసో

*కాంగో

*ఇథియోపియా

*అంగోలా

*భారతదేశం

*సుడాన్

*కొరియా

*రువాండా

*నైజీరియా

*ఆఫ్ఘనిస్తాన్

*లెసోతో

*సియర్రా లియోన్

*లైబీరియా

*మొజాంబిక్

*హైతీ

Show Full Article
Print Article
Next Story
More Stories