Garib Kalyan Yojana: ఉచిత రేషన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

Garib Kalyan Yojana: Central Cabinet Approves Free Ration Scheme
x
పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన (ఫైల్ ఇమేజ్)
Highlights

Garib Kalyan Yojana: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మరో 5 నెలలు పొడిగింపు

Garib Kalyan Yojana: వచ్చే దీపావళి వరకు పేదలకు ఉచితంగా తలసరి నెలకు 5 కేజీల ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని మోడీ ఈనెల 7న జాతినుద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా ఈ మేరకు ఇచ్చిన హామీని అమలు చేయనుంది. కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉచితంగా రేషన్ సరఫరా చేసింది. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో దాన్ని నవంబరు వరకు మరో అయిదు నెలల పాటు పొడిగించింది. 81.35 కోట్ల మంది లబ్దిదారులకు జాతీయ ఆహారభద్రత చట్టం కింద రేషన్ ఇవ్వాలని గతంలోనే నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రప్రభుత్వం ఆహార సబ్సిడీ కింద 64 వేల 31 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.

రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈపూర్తి మొత్తాన్ని కేంద్రమే భరిస్తోంది. ఇందుకోసం 204 లక్షల మెట్రిక్ టన్నుల తిండిగింజలు అవసరమవుతాయని అంచనా వేసింది. మొత్తం 8నెలలకు గానూ 321 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా అందులో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే 305 లక్షల మెట్రిక్ టన్నులను ముందుస్తుగానే తీసుకెళ్లాయి. ఈ పథకం ఖర్చు 64 వేల 266 కోట్లకు చేరనుంది. మరోవైపు... మినీరత్నం హోదా కలిగిన కేంద్ర రైల్ సైడ్ వేర్ హౌస్‌ కంపెనీ లమిటెడ్‌ను సెంట్రల్ గిడ్డంగుల కార్పొరేషన్‌లో విలీనం చేయడానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories