Crime News: ప్రెసిడెంట్‌ నుంచి అవార్డు.. కానీ ఈ పోలీస్‌ ఆఫీసర్‌ ఎంత దుర్మార్గుడో మీరే తెలుసుకోండి!

Crime News
x

Crime News: ప్రెసిడెంట్‌ నుంచి అవార్డు.. కానీ ఈ పోలీస్‌ ఆఫీసర్‌ ఎంత దుర్మార్గుడో మీరే తెలుసుకోండి!

Highlights

Crime News: ఈ కేసు దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై మరోసారి దృష్టిని సారించింది. నిందితుడి ఖాతాలో ఉన్న గౌరవం పరంగా చూస్తే, మోసం, అధికారం దుర్వినియోగం వ్యవస్థలోని లోపాల్ని ఈ ఘటన బట్టబయలు చేసింది.

Crime News: 2016లో మహిళా పోలీసు అధికారి హత్య కేసులో తొమ్మిది సంవత్సరాల తర్వాత న్యాయం జరిగినట్టు కనిపిస్తోంది. మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలోని సెషన్స్ కోర్టు ఒక సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ అభయ్ కురుండ్కర్‌తో పాటు మరొ ముగ్గురిని హత్య కేసులో దోషులుగా తేల్చింది. కురుండ్కర్‌కు 2017లో ప్రెసిడెంట్ గాలంట్రీ అవార్డు లభించగా, అదే సంవత్సరం అతన్ని ఈ కేసులో అరెస్ట్ చేశారు.

విచారణ సందర్భంగా జడ్జి కే.జి. పాల్దేవార్ విచారం వ్యక్తం చేశారు. ఒక అవార్డు పొందిన ఓ ఆఫీసర్ ఇంత హీనమైన పంథాలో తన సహోద్యోగినిని హత్య చేయడాన్ని ఆశ్చర్యంగా పేర్కొన్నారు. నలుగురు నిందితులలో ఒకరిని సాక్ష్యాలలేమితో కోర్టు విరమించగా, మిగతా ముగ్గురికి ఏప్రిల్ 11న శిక్ష ఖరారవుతుంది. ప్రాసిక్యూషన్ ప్రకారం, కురుండ్కర్ ప్రధాన నిందితుడు. అతను అప్పట్లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశ్వినీ బిద్రెతో సంబంధంలో ఉన్నాడు. అయితే ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేశాడని అభియోగం. అతని ఇంట్లోనే ఈ హత్య జరిగింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి, సహాయంతో నదిలో పడేశారని చెబుతున్నారు. ఆ ట్రంక్‌లు గల మృతదేహం ఇప్పటివరకు కనుగొనబడలేదు.

కేసు మొత్తం కాల్ డేటా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, కెమికల్ విశ్లేషణ నివేదికలు, పరిస్ధితుల ఆధారిత సాక్ష్యాలపై ఆధారపడి నడిపించారు. బిద్రె అప్పట్లో నవీ ముంబైలో ఒంటరిగా ఉండగా, ఆమె భర్త కొల్హాపూర్‌లో ఉండేవాడు. 2016 ఏప్రిల్‌లో ఆమె మాయమయ్యారు. అనంతరం ఆమె సోదరుడు పన్వెల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు ఇచ్చాడు. కానీ జనవరి 2017లో FIR నమోదు అయింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ మొత్తం 84 మంది సాక్షులను విచారించింది. తర్వాత నిందితుల స్టేట్‌మెంట్లు కూడా నమోదయ్యాయి. ఈ విచారణకు సంబంధించిన ఆధారాల పత్రాలు వందల పేజీలుగా ఉన్నాయి. అందువల్ల పూర్తి తీర్పును వ్రాయడానికి సమయం పడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఘటనా స్థల పరిశీలన కోసం ప్రాసిక్యూషన్ కోర్టును అభ్యర్థించినా, కోర్టు నిరాకరించింది. ఇప్పటికే తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, విచారణలో ఉన్నదే సరిపోతుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories