అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను ప్రకటించిన షెకావత్

అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను ప్రకటించిన షెకావత్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను గజేంద్ర సింగ్‌ షెకావత్ ప్రకటించారు. ' సమావేశంలో నాలుగు అజెండా అంశాలపై చర్చ జరిగింది. విభజన చట్టం ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకుంటాం.. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చాం.. వివాదాల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు సహకరించినందుకు ధన్యవాదాలు.. ప్రాజెక్టుల డీపీఆర్ లు సమర్పించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకారం తెలిపారు.. వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ లో అడుగు ముందుకు పడింది.

ట్రిబ్యునల్ అవార్డులను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నాం.. హైదరాబాద్ నుంచి విజయవాడకు కృష్ణా రివర్ బోర్డును తరలించడానికి , కేఆర్ఎంబి ఆఫీస్ తరలింపునకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. 2014 లో ఏపీ విభజన జరిగింది.. విభజన చట్టం ప్రకారమే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది.. కృష్ణా , గోదావరి నదులపై ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి.' అని షెకావత్ అన్నారు. ఇదిలావుంటే దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. ఏపీ సీఎం జగన్‌తోపాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ , అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories