ఇస్రో శాస్త్రవేత్తలు సృష్టించిన అద్భుతం వ్యోమమిత్ర.. ఏం చెస్తారో తెలుసా?

ఇస్రో శాస్త్రవేత్తలు సృష్టించిన అద్భుతం వ్యోమమిత్ర.. ఏం చెస్తారో తెలుసా?
x
Highlights

రోబో సినిమాలో రజనీ కాంత్ రూపొందించిన రోబో ఒకటి తెగ హంగామా చేసేస్తుంది. అందులో దేశ రక్షణ కోసం ఆ రోబోను రూపొందిస్తారు రజినీ.

రోబో సినిమాలో రజనీ కాంత్ రూపొందించిన రోబో ఒకటి తెగ హంగామా చేసేస్తుంది. అందులో దేశ రక్షణ కోసం ఆ రోబోను రూపొందిస్తారు రజినీ. దానిని రోబోగా కాకుండా మనుషులకు ఉండే ఫిలీంగ్స్ తీసుకురావడానికి తెగ కష్టపడతాడు. ఆ సినిమాలో హీరో అనుకున్నది సాధిస్తాడు. ఆ రోబోకు వైద్య చేయడం తెలుస్తుంది. ఆస్పత్రిలో ఓ మహిళకు సిజేరియన్ అవసరం లేకుండా బిడ్డను బయటకు తీస్తుంది. అది అంతా సినిమా అని పక్కన పెడతాం. ఇప్పుడు వాస్తవంలోకి వద్దాం.. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఓ రోబో కూడా అచ్చం మనుషుల్లా మాట్లాడుతుంది. ఆలోచించే పనిచేస్తుంది.

కాగా.. ఇస్రో తయారు చేసిన రోబోకు ఓ పేరు పెట్టింది. ఆపేరు ఏంటి అనుకుంటున్నారా? దాని పేరు మిత్ర.. ఈ పేరు చాలా క్యూట్ గా ఉందని పిస్తుంది కదా.. అంతే కాదు ఈ రోబో చూడడానికి అచ్చు ఓ అందమైన యువతిలానే కనిపిస్తుంది. అంతాబాగానే ఉంది అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ రోబోను ఎందుకు రూపొందించిందో తెలుసా? గగనయాన్ ప్రాజె్క్టులో భాగంగా 2022లో రోదసీలోకి మనుషుల్ని (వ్యోమగాములు ) పంపించేందుకు భారత అంతరిక్ష పరిసోదన సంస్థ (ఇస్రో) సిద్దమవుతుంది. అందులో భాగంగా.. ఈ రోబోను కూడా వారితోపాటు పంపుతుంది. వ్యోమగాములతోనే ఉంటుంది. వారి ఆరోగ్యం తెలుసుకుని ఎప్పటికప్పుడు ఇస్రోకి సమాచారం అందిస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఆ సమాచారం ఇస్రోకి అందజేస్తుంది.

ఇక ఈ రోబోలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది చక్కగా మాట్లాడగలదు, ఎవరైనా ఎదైనా ప్రశ్న వేయగానే దానికి టక్కున ఆన్సర్ చెబుతుంది. అందువల్ల రోబోతో మాట్లాడుతూ.. వ్యోమగాముల రోదసి ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకుంటుంది. ప్రయోగాత్మక పద్ధతిలో రోబోను పంపించబోతున్నట్లు పేర్కొంది. అయితే ఈ రోబో ఒక వేళ పనిచేయకపోతే శాస్త్రవేత్తలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రపంచమంతా భవిష్యత్తులో రోబో టెక్నాలజీ వాడే అవకాశం ఉంటుంది. దీంతో ఇస్రో కూడా ప్రయోగాత్మకంగా దీనిని రూపొందించింది.

‎‎ఇస్రో శాస్త్రవేత్త శ్యామ్ దయాళ్ సంబంధించిన కీలక విషయాలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యోమమిత్ర బాగుందని,అమ్మయిలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories