G20 Summit: అదిరిపోయేలా జీ20 అతిథ్యం.. దేశాధినేతలకు బంగారం, వెండి పాత్రల్లో విందు..!

G20 Attendees to be Served Lunch in Silver and Gold Utensils
x

G20 Summit: అదిరిపోయేలా జీ20 అతిథ్యం.. దేశాధినేతలకు బంగారం, వెండి పాత్రల్లో విందు..!

Highlights

G20 Summit: వెండి ప్లేట్​లో మూడు సింహాల ముద్రణ..

G20 Summit: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీ20 సదస్సును ఈసారి మనదేశంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్రం.. చేసిన ఏర్పాట్లు ఔరా అనిపిస్తున్నాయి. దేశాధినేతలు భోజనం చేసేందుకు బంగారం, వెండి పాత్రలను అందంగా తయారు చేయించారు. సాధారణంగా విదేశాల్లో సమావేశాలు జరిగితే గ్లాస్‌, పింగాణీ పాత్రల్లో వడ్డిస్తారు. అయితే.. భారతీయ సంప్రదాయాలు, హుందాతనం ఉట్టిపడేలా ప్రభుత్వం ఈ విధంగా బంగారం, వెండి లోహాలతో పాత్రలు సిద్ధం చేశారు.

2023 సంవత్సరానికి గానూ ప్రతిష్ఠాత్మకమైన జీ20 శిఖరాగ్ర సదస్సుకు వేదికైన భారత్‌.. అందుకు భారీ ఏర్పాట్లు చేసింది. అగ్ర దేశాల అధినేతలు భోజనం చేసేందుకు అద్భుతమైన పాత్రలు తయారు చేయించింది. ఇందుకు ఓ సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది.

ఆ సంస్థ తయారు చేసిన పాత్రలు చూస్తే ఔరా అనాల్సిందే. మహారాజులు, చక్రవర్తులు విందులో కూర్చుంటే కనిపించే పాత్రలా అనేలా అవి ఉన్నాయి. సాధారణంగా వేరే దేశాల్లో ప్రతినిధులకు ఏర్పాటు చేసే విందులో పింగాణీ, గ్లాస్‌లతో తయారు చేసిన పాత్రలే కనిపిస్తుంటాయి. భారత్‌లో మాత్రం పూర్తిగా బంగారం వెండితోనే తయారు చేసిన పాత్రలు కనిపిస్తున్నాయి.

జీ20 కోసం తయారు చేసిన ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్టత ఉందని తయారీ దారులు చెబుతున్నారు. వీటి తయారీకి ముందు వివిధ రాష్ట్రాల్లో పర్యటించామని, భారత సంస్కృతికి అద్దం పట్టేలా వీటిని తయారు చేసినట్లు తెలిపారు. దక్షిణ భారతంలో పర్యటించి అరిటాకు డిజైన్‌ ఉన్న కంచాన్ని తయారు చేశారు.

అలాగే జాతీయ పక్షి నెమలి ఆకృతిలో మంచినీరు సర్వ్‌ చేసే పాత్రలు రూపొందించారు. పానీయ పాత్రలపై పుష్పాలు, లతలను ముద్రించారు. పండ్లు అందించేందుకు నెమలి పింఛం ఆకృతిలో ప్లేట్‌ రెడీ చేశారు. ఓ వెండి కంచెంలో భారత జాతీయ చిహ్నం మూడు సింహాలను ముద్రించారు. అతిథి దేవో భవః అనే భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా వీటిని కేంద్రం తయారు చేయించిందని తయారీ దారులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories