దక్షిణాఫ్రికాలో గ్యాంగ్‌స్టర్ రవి పూజారీ అరెస్ట్.. బెంగుళూరు తరలింపు

దక్షిణాఫ్రికాలో గ్యాంగ్‌స్టర్ రవి పూజారీ అరెస్ట్.. బెంగుళూరు తరలింపు
x
Highlights

15 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతోన్న గ్యాంగ్‌స్టర్ రవి పూజారీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దక్షిణాఫ్రికాలో అతన్ని అరెస్టు చేశారు,...

15 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతోన్న గ్యాంగ్‌స్టర్ రవి పూజారీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దక్షిణాఫ్రికాలో అతన్ని అరెస్టు చేశారు, అంతకుముందు కర్ణాటకకు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారులతో సహా అధికారుల బృందం భారతదేశానికి తీసుకువస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ఆదివారం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నట్టుగానే సోమవారం ఉదయం నాటికి పూజారిని బెంగుళూరుకు తీసుకువచ్చింది. పోలీసులు, సెనెగల్‌ భద్రతా సంస్థల సంయుక్త ఆపరేషన్‌లో ఈ గ్యాంగ్‌స్టర్‌ను దక్షిణాఫ్రికాలో పట్టుకున్నారు, తరువాత సెనెగల్‌కు రప్పించారు.

సెనెగల్‌లో అతన్ని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న అదనపు పోలీసు జనరల్ అమర్ కుమార్ పాండే, బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ సహా పోలీసు అధికారుల బృందం అతన్ని తీసుకురావడానికి సెనెగల్ వెళ్లింది. ఈ బృందం గాంగ్ స్టర్ ను రప్పించే ప్రక్రియను పూర్తి చేసి చివరకు ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో బెంగళూరుకు తీసుకువచ్చింది. గత ఏడాది సెనెగల్ అధికారులు ఈ డాన్‌ను అరెస్టు చేశారు.. భారత పోలీసులు అతనిని పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించారు, కాని స్థానిక కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో అతను పారిపోయాడు.

దాంతో అతన్ని పట్టుకోవడంలో ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కానీ ఎట్టకేలకు ఆ దేశంతో మాట్లాడి అతన్ని అరెస్ట్ చేయించడంతో పని పూర్తి చేసింది. అండర్‌వరల్డ్ డాన్ చోటా రాజన్‌తో విడిపోయిన పూజారి, ఆపై దక్షిణాఫ్రికాకు పారిపోయాడు. దక్షిణాఫ్రికాలో కూడా పూజారీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీకి పాల్పడ్డాడు. దాంతో అతన్ని ఇటీవల సెనెగల్ నుంచి బహిష్కరించారు. అంతకుముందు భారత్ లో కూడా హత్య మరియు దోపిడీతో సహా 200 కి పైగా ఘోరమైన నేరాలకు రవి పూజారి పాల్పడ్డాడు..

దాదాపు 15 సంవత్సరాలుగా అతను పరారీలో ఉన్నాడు. అతను ఇంతకాలం దక్షిణాఫ్రికాలోని మారుమూల గ్రామంలో బుర్కినా ఫాసో పాస్‌పోర్ట్ హోల్డర్ అయిన ఆంథోనీ ఫెర్నాండెజ్ యొక్క తప్పుడు గుర్తింపుతో తలదాచుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం నిరంతర ప్రయత్నాల ద్వారా, 2019 ప్రారంభంలో రవి పూజారిని అప్పగించాలని ఆ దేశాన్ని అభ్యర్ధించింది. దాంతో పూజారీని 2020 ఫిబ్రవరి 22 న సెనెగల్ నుండి రప్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories