Karnataka: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం

Free Travel for Women in RTC Buses has Started in Karnataka
x

Karnataka: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం

Highlights

Karnataka: శక్తియోజనను స్వయంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే .. రాష్ట్రంలోని మహిళలంతా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్​ మాట నిలబెట్టుకుంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం 'శక్తి యోజన' ను స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ పథకాన్ని నేడు సీఎం సిద్ధరామయ్య అధికారికంగా ప్రారంభించారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినులకు కూడా ఈ సౌకర్యం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇందుకు కొన్ని కండిషన్లను కూడా పెట్టింది.

రాజహంస, వజ్ర, వాయువజ్ర, ఐరావత, అంబారీ, అంబారీ ఉత్సవ్, ఎఫ్టీ బస్, ఈవీ పవర్ ప్లస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపింది.

ప్రభుత్వ జీవో ప్రకారం.. ఉచిత బస్సు ప్రయాణ సేవలు మహిళలు, హిజ్రాలుకు ఈ పథకం కూడా వర్తిస్తుంది. మూడు నెలల్లో స్మార్ట్‌కార్డుల పంపిణీ పూర్తవుతుందని కర్ణాటక ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.స్మార్ట్‌కార్డులు అందని వారు కర్ణాటక ప్రభుత్వం జారీచేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అదనంగా జీరో టికెట్-శక్తి స్మార్ట్ కార్డ్ డేటా ఆధారంగా రవాణా ఏజెన్సీలు చేసే ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఇక మహిళా ప్రయాణికులు ప్రయాణించే దూరం ఆధారంగా రోడ్డు రవాణా సంస్థకు రీయింబర్స్‌మెంట్ అవుతుంది. అలాగే కర్ణాటక పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుందని.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే కర్ణాటక బస్సుల్లో కానీ, కర్ణాటకలోకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సుల్లో కానీ ఈ పథకం పనిచేయదని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories