PM Modi on Pradhan Mantri Garib Kalyan Yojana: అన్‌లాక్ 1 తర్వాత నిర్లక్ష్యం పెరిగింది.. నవంబ‌ర్ వ‌ర‌కు రేష‌న్ పంపిణీ : ప్రధాని మోదీ

PM Modi on Pradhan Mantri Garib Kalyan Yojana: అన్‌లాక్ 1 తర్వాత నిర్లక్ష్యం పెరిగింది.. నవంబ‌ర్ వ‌ర‌కు రేష‌న్ పంపిణీ : ప్రధాని మోదీ
x
Prime minister Modi (file photo)
Highlights

:PM Modi on Pradhan Mantri Garib Kalyan Yojana : భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మరోవైపు లాక్‌డౌన్ 5 (అన్‌లాక్ 1) ఇవాళ్టితో ముగుస్తుంది. ...

:PM Modi on Pradhan Mantri Garib Kalyan Yojana : భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మరోవైపు లాక్‌డౌన్ 5 (అన్‌లాక్ 1) ఇవాళ్టితో ముగుస్తుంది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి అన్‌లాక్ 2 మొదలవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప‌లు మార్గదర్శకాలకు కేంద్రహోంశాఖ ప్ర‌క‌టించింది. కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ కంపెనీ కొవాక్సిన్ అనే కరోనా వాక్సీన్‌ను సిద్ధం చేసింది. మనుషులపై క్లినిక‌ల్ ట్రైల్స్ కు ఇప్పటికే డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కరోనా వాక్సిన్‌పై ప్రధాని మోదీ సైతం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా జాతీనుద్దేశించి మోదీ ప్ర‌సంగించారు.

కరోనా వైరస్ మన దేశంలో అదుపులోనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. అయితే అన్‌లాక్ 1 తర్వాత నిర్లక్ష్యం పెరిగిందని ఆయ‌న అన్నారు. రాబోయే రోజుల్లో అంటు వ్యాధులు చుట్టుముడతాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయ‌న‌ స్పష్టం చేశారు.

కరోనాతో పోరాటం చేస్తూ అన్ లాక్ 2లోకి ప్రవేశించామని మోదీ అన్నారు. కరోనాను కట్టడి సమయానుగుణంగా తీసుకున్న నిర్ణయాల వల్లే నియంత్రించ‌గలిగామని ప్రధాని తెలిపారు. క‌రోనా వైర‌స్ పై ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యం వ‌ద్ద‌ని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో పండగలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నవంబరు ఆఖరు వరకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంద‌ని ప్రధాని మోదీ అన్నారు. దీని ద్వారా ఎక్క‌డైనా రేష‌న్ తెచ్చుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్న‌మని మోదీ స్ప‌ష్టం చేశారు.

"రాబోయే రోజుల్లో పండగలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే నవంబరు ఆఖరు వరకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నాం. 90 కోట్ల రూపాయ‌లు అదనంగా కేటాయిస్తున్నాం. ఈ పథకం కింద 80 కోట్ల మంది భార‌తీయులకు రేష‌న్ ఉచితంగా పంపిణీ చేస్తాం. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల బియ్యం లేదా ఐదు కిలోల గోధుమలు, కుటుంబానికి నెలకు కిలో చొప్పున కందిపప్పు ఇస్తాం". మనమందరం 'లోకల్ కోసం 'గొంతుకలుపుదాము.ఈ సంకల్పంతో, 130 కోట్ల మంది దేశస్థులు సంకల్పంతో కలిసి పనిచేయాలి మరియు ముందుకు సాగాలి. మ‌రోసారి నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను, మీ కోసం కూడా ప్రార్థిస్తున్నాను, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, రెండు గజాల దూరాన్ని అనుసరిస్తూ ఉండండని మోదీ స్ప‌ష్టం చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories