Student Free Laptop Scheme: విద్యార్థులకు ఫ్రీ ల్యాప్​టాప్ స్కీం.. దరఖాస్తు చేసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి

Student Free Laptop Scheme: విద్యార్థులకు ఫ్రీ ల్యాప్​టాప్ స్కీం.. దరఖాస్తు చేసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి
x
Highlights

Student Free Laptop Scheme: కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ల్యాప్ టాప్ స్కీమును తీసుకువచ్చిందా? కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్...

Student Free Laptop Scheme: కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ల్యాప్ టాప్ స్కీమును తీసుకువచ్చిందా? కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వన్ స్టూడెంట్ వన్ ల్యాప్ టాప్ యోజన స్కీము నిర్వహణ బాధ్యతలు చూస్తోందా. ఈ స్కీము ఎప్పుడు ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బీటెక్, డిగ్రీతోపాటు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ తప్పనిసరి అవసరం అయ్యింది. కాస్త మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్ టాప్ ధర కనీసం రూ. 40వేలు ఉంటుంది. ఇంకా మంచి ఫీచర్స్ ఉండాలంటే రూ. 70వేలకు పైగా మాటే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి విద్యార్థులను ద్రుష్టిలో ఉంచుకుని కేంద్రం ఫ్రీ ల్యాప్ టాప్ స్కీముకు శ్రీకారం చుట్టిందని వార్తలు వస్తున్నాయి. స్కీము వివరాలు, ఎవరెవరు అర్హులు, దరఖాస్తు విధానం, వివరాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థలుందరికీ ఫ్రీగా లాప్ ట్యాప్ స్కీమ్ ప్రవేశపెట్టిందని వార్తలు ఈ మధ్యకాలంలో చాలా సైట్లలో దర్శనమిస్తున్నాయి. కానీ అదంతా అవాస్తవము. కొంతమంది వ్యూస్ పెంచుకునేందుకు చేస్తున్న దుష్ప్రచారమని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఫ్రీ ల్యాప్ టాప్ స్కీముకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ మొబైల్ కు ఏవైనా మెసేజ్, లింక్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లింకులు క్లిక్ చేసి మీ సమాచారాన్ని షేర్ చేయకూడదు. మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ (https://www.aicte-india.org)కి వెళ్లాలి వివరాలు చెక్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories