logo
జాతీయం

4వ దశ లోక్‌సభ ఎన్నికలు : పోలింగ్ శాతం ఎంతంటే..

4వ దశ లోక్‌సభ ఎన్నికలు : పోలింగ్ శాతం ఎంతంటే..
X
Highlights

నాలుగో దశ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటల వరకు బిహార్‌లో 53.67 శాతం,...

నాలుగో దశ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటల వరకు బిహార్‌లో 53.67 శాతం, జమ్ము&కశ్మీర్‌లో 9.79, శాతం, మధ్యప్రదేశ్‌లో 65.86 శాతం, మహారాష్ట్ర 51.06 శాతం, ఒడిశా 64.05 శాతం, రాజస్తాన్‌ 62.86 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 53.12 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 76.47 శాతం, జార్ఖండ్‌ 63.40 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ అంచనా వేసింది. ఎన్నికల్లో బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బిజు జనతాదళ్‌ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్‌లోని సేరంపూర్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్‌ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌ అసన్‌సోల్ నియోజకవర్గంలో టీఎంసీ కార్యకర్తలు ఓ మహిళా రిపోర్టర్‌పై దాడికి పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్‌ బిర్‌భూమ్‌ జిల్లాలోని ననూర్‌లో టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పెద్దర్‌ రోడ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్‌ స్టార్ హృతిక్‌ తన కుటుంబం సభ్యులతో కలసి ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ఖాన్‌ ఆయన సతీమణి కిరణ్‌రావ్‌ ముంబై బాంద్రాలోని అన్నెస్‌ హైస్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హీరో రణ్‌వీర్‌ సింగ్‌ తన తండ్రితో కలిసి బాంద్రాలో ఓటు వేశారు. హీరోయిన్‌ కరీనా కపూర్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రికెట్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ సెంటర్‌ 203లో సచిన్‌, ఆయన సతీమణి అంజలీ, కుమారుడు అర్జున్‌, కూతురు సారా ఓటు వేశారు.

Next Story