Election Results 2023: కమలం జోష్‌.. హస్తం పరేషాన్.. నాలుగు రాష్ట్రాల ఫలితాలు విడుదల

Four States Assembly Election Results 2023
x

Election Results 2023: కమలం జోష్‌.. హస్తం పరేషాన్.. నాలుగు రాష్ట్రాల ఫలితాలు విడుదల

Highlights

Election Results 2023: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఊహించని ఫలితాలు

Election Results 2023: నాలుగు రాష్ట్రాల ఫలితాలూ విడుదలయ్యాయి. వీటిలో తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కి ఎదురు దెబ్బే తగిలింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవానే కొనసాగింది. ఉత్తరాదిన పూర్తిగా పట్టు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. సౌత్‌లో మాత్రం కర్ణాటక, తెలంగాణను తమ ఖాతాలో వేసుకుంది. ఇది కొంత వరకూ ఊరటనిచ్చినప్పటికీ...నార్త్ బెల్ట్‌ని కోల్పోవడం మాత్రం పెద్ద దెబ్బే. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు బీజేపీ జోష్‌ని రెట్టింపు చేయగా...కాంగ్రెస్‌ని నిరాశపరిచింది. తెలంగాణ ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమే. కానీ...ఉత్తరాదిలో పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది.

వచ్చే ఏడాది మేలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రీఫైనల్‌గా పోల్చారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఐదు రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించి రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంట్‌ పోరులో నిలవాలని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ఆశించాయి. మూడోసారి అధికారం నిలుపుకోవాలని కమలం పార్టీ, ఈసారైనా మోడీని గద్దెదించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచించాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు వీటిని సెమీఫైనల్‌గా భావించి పోటీ పడి మరీ ప్రచారం చేశాయి. కానీ తెలంగాణ మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చేధు ఫలితాలే ఎదురయ్యాయి. ఇటు రాజస్థాన్‌లో, అటు చత్తీస్‌గడ్‌లో అధికాన్ని కోల్పోయింది కాంగ్రెస్. మధ్యప్రదేశ్‌లోనూ..గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన హస్తం.. ఈసారి కేవలం 70స్తానాల లోపై సాధించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు.. ముందు కాంగ్రెస్‌కు ఇది పెద్ద అనే చెప్పాలి. అలాగే కాంగ్రెస్ నేతృత్వం వహిస్తు్న్న ఇండియా కూటమి భవిష్యత్‌ ఏంటన్నదే అంతుపట్టకుండా ఉంది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కచ్చితంగా లోక్‌సభ ఎన్నికలపై ఉంటుంది. ఇదే కాంగ్రెస్‌ని ఇరకాటంలోకి నెట్టింది. కాంగ్రెస్ ఓడిపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన కామెంట్స్‌ని బట్టి చూస్తుంటే కూటమిలో చీలికలు మొదలవుతాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఓడిపోవడం బీజేపీ సక్సెస్ కాదని, కాంగ్రెస్ వైఫల్యమే అని తేల్చి చెబుతోంది టీఎమ్‌సీ. జనతా దళ్ నేతలూ కీలక వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ ఓడిపోవడం అంటే విపక్ష కూటమి ఓడిపోయినట్టు కాదు" అని స్పష్టం చేస్తున్నారు. బీజేపీని కాంగ్రెస్ ఢీకొట్టలేదని, ఆ భ్రమ నుంచి ఆ పార్టీ బయటకు రావాలని కొందరు విపక్ష నేతలు నేరుగానే చెబుతున్నారు. డిసెంబర్ 6న ఖర్గే నివాసంలో I.N.D.I.A కూటమి సమావేశం కానుంది. ఈ భేటీకి కొందరు నేతలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కూటమి వ్యూహాలను మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నాయి. అంతే కాదు. అసలు కూటమిలో కొనసాగాలా వద్దా అని పునరాలోచనలో పడ్డట్టూ సమాచారం.

మూడు రాష్ట్రాల్లో ఓటమితో.. సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్‌ డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. మిగతా పార్టీలు ఏం చెబితే అది వినాల్సి వస్తుంది. లేదా పూర్తిగా కూటమే కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ విభేదాలు ఫైనల్‌గా బీజేపీకే ప్లస్ అవుతాయి. వాళ్లలో వాళ్లకే సఖ్యత లేదని ఇప్పటికే బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కాంగ్రెస్‌ పరిస్థితి చాలా వరకూ మారిపోయేది. కానీ...తెలంగాణలో గెలిచామన్న సంతోషం తప్ప మరేమీ మిగల్లేదు. ఇప్పటికే బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్ భవిష్యత్‌ని నిర్ణయించనున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి జోష్ ఇస్తాయనుకుంటే ఉన్న జోరునీ తగ్గించాయి. ఇప్పటి నుంచి ఈ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. భారత్ జోడో యాత్రతో కొంత క్యాడర్‌లో జోష్ పెరిగిందని భావించినా...అది ఎంతో కాలం కొనసాగేలా లేదు.











Show Full Article
Print Article
Next Story
More Stories