జమ్మూ కాశ్మీర్‌లో మరో నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

జమ్మూ కాశ్మీర్‌లో మరో నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌
x
Highlights

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్టు గుర్తించిన భద్రతా దళాలు కుల్గాంలోని గద్దర్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్లో ఒక ఆర్మీ అధికారికి గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరణించిన ఉగ్రవాదుల ఏ సంస్థకు చెందినవారో ఇంకా గుర్తించలేదు. అయితే వారిలో ఒకరు స్థానిక ఉగ్రవాది అని గుర్తించారు.

కుల్గం జిల్లాలోని గద్దర్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దాంతో రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్), స్థానిక పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.. నలుగుర్ని ఎన్‌కౌంటర్ చేశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మరోవైపు, పంజాబ్‌లోని అమృత్సర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ .25 లక్షలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను భారత్ లో పెద్ద దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories