logo
జాతీయం

ఢిల్లీలో దారుణం... నలుగురు కుటుంబ సభ్యులను చంపిన యువకుడు

four family members were killed by a young man
X

ఢిల్లీలో దారుణం... నలుగురు కుటుంబ సభ్యులను చంపిన యువకుడు

Highlights

* సొంత కుటుంబసభ్యులందరినీ హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Delhi Murder: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు.. తన కుటుంబం మొత్తాన్ని హతమార్చాడు. ఈ మర్డర్‌ మిస్టరీ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తన తండ్రిసహా కుటుంబంలోని ఆడవాళ్ళందరినీ కొడుకు మర్డర్‌ చేశాడు. ఢిల్లీలోని పాలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నట్టింట్లో రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాలను చూసి స్థానికులు హడలిపోయారు. తండ్రి, అమ్మమ్మ, ఇద్దరు చెల్లెళ్లను దారుణంగా హతమార్చాడు ఆ యువకుడు. సొంత కుటుంబసభ్యులందరినీ హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

తెల్లవారుజామున ఢిల్లీలోని పాలమ్‌ ప్రాంతానికి చెందిన యువకుడు తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను విచక్షణరహితంగా కొట్టి నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కేశవ్ గా గుర్తించారు. అతను ఒక డ్రగ్ అడిక్ట్ అని ఇటీవలనే మాదకద్రవ్యాల పునరావాస కేంద్రం నుంచి తిరిగి వచ్చాడని పేర్కొంటున్నారు. కుటుంబసభ్యులతో గొడవపడి నిందితుడు కేశవ్ తల్లిదండ్రులు, సోదరి, అమ్మమ్మలను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.

మృతిచెందిన ముగ్గురు మహిళల్లో ఒకరు ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పడి ఉండగా, మరో రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అయితే హత్యలకు గల కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. హత్యల అనంతరం నిందితుడు తప్పించుకునే ప్లాన్‌ వేశాడని అతని బంధువులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు.

Web TitleFour Family Members Were Killed By A Young Man
Next Story