Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌

Former Union Minister Vishnu Deo Sai Is The New Chhattisgarh Chief Minister
x

Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్‌ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌

Highlights

Chhattisgarh New CM: 2016లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు

Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని బీజేపీ ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్ బీజేపీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో.. కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయ్‌ని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. మాజీ ఎంపీ విష్ణుదేవ్ సాయ్‌ని బీజేపీ సీఎల్పీ నేతగా ప్రకటించింది. కాగా.. మాజీ సీఎం రమన్ సింగ్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.

కాగా.. విష్ణుదేవ్ సాయ్‌ 2014 నుంచి 2019 వరకు రాయ్‌గఢ్ లోక్ సభ సభ్యునిగా ఉన్నారు. 1990 నుంచి 1998 వరకూ రెండు పర్యాయాలు మధ‌్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడిగా.. నీటి వనరుల కమిటీ సభ్యుడిగా... వాణిజ్య కమిటీ సభ్యుడిగా.. పనిచేశారు. 2014లో గనులు.. ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2016లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories