మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి అస్వస్థత!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి అస్వస్థత!
x
ManMohan Singh (File Photo)
Highlights

దేశ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆయన బంధువులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి...

దేశ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆయన బంధువులు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. చాతి నొప్పితో మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు నిర్ధారించారు.. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి..

ఇక మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు పనిచేశారు.. భారతదేశానికి 17వ ప్రధానిగా ఆయన 2004లో బాధ్యతలు చేపట్టారు. ప్రధానమంత్రి గానే కాకుండా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ పని చేశారు. అంతేకాకుండా భారత రిజర్వు బ్యాంకుకి డైరెక్టర్ గా కూడా మన్మోహన్ సింగ్ వ్యవహరించారు. ఇక ఆయన ఆస్పత్రిలో చేరడంతో కాంగ్రెస్ నేతలు, మరియు రాజకీయ ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories