Former President Pranab Mukherjee: కోమాలోనే మాజీ రాష్ట్ర పతి.. వెల్లడించిన ఆస్పత్రి వర్గాలు

Former President Pranab Mukherjee:మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం కోమాలోనే ఉన్నారని ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Former President Pranab Mukherjee:మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం కోమాలోనే ఉన్నారని ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రెండు రోజులుగా ఆయన మరణంపై వస్తున్న వదంతులను కుమారుడు ఖండించారు. నిజనిజాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేయాలని ఆయన మీడియాను కోరారు. మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆసుపత్రి గురువారం తెలిపింది.
ప్రణబ్ చికిత్సకు మెల్లిగా స్పందిస్తున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. 'నా తండ్రి ఒక పోరాటయోధుడు. చికిత్సకు నెమ్మదిగా స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా శ్రేయోభిలాషులను కోరుతున్నాను'అని అభిజిత్ ట్వీట్ చేశారు. మెదడులో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆసుపత్రిలో చేరగా ఆయనకుకోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స జరిగింది. మరోవైపు ప్రణబ్ మరణించారన్న వదంతులు ప్రబలడంతో ఆయన కుమారుడు అభిజిత్ వాటిని కొట్టిపారేశారు. ''మా తండ్రి శ్రీ ప్రణబ్ బతికే ఉన్నారు. పేరుప్రఖ్యాతులున్న జర్నలిస్టులే ఊహాగానాలు, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం భారత మీడియా రంగం నకిలీ వార్తల ఫ్యాక్టరీగా మారిందన్న ఆరోపణలకు అద్దం పట్టేదిలా ఉంది''అని ట్వీట్ చేశారు. ''మా తండ్రికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ వదంతులే. ఆసుపత్రి నుంచి వచ్చే సమాచారం కోసం ఫోన్ అందుబాటులో ఉంచాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఎవరూ.. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు నన్నుసంప్రదించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా''అని ప్రణబ్ కుమార్తె షర్మిష్ట ట్వీట్ చేశారు.
హైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ
3 July 2022 1:44 PM GMTPawan Kalyan: ప్రభుత్వ పథకాల్లో చాలా మందికి కోత పెడుతున్నారు
3 July 2022 1:26 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTపాకిస్థాన్లో ఘోర ప్రమాదం
3 July 2022 1:00 PM GMTఅమర్నాథ్ యాత్రలో విషాదం.. మూడ్రోజుల్లో ఐదుగురు మృతి
3 July 2022 12:30 PM GMT