కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
x
Highlights

బీదర్ దేశద్రోహ కేసు ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడానికి ప్రయత్నించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు...

బీదర్ దేశద్రోహ కేసు ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడానికి ప్రయత్నించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. సిద్దరామయ్య తోపాటు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు దినేష్ గుండు రావు, రిజ్వాన్ అర్షద్, కె సురేష్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.

దాంతో పోలీసుల తీరుపై సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.. "రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తుందని సిద్దరామయ్య ఆరోపించారు. కాగా బీదర్ లోని షాహీన్ ప్రైమరీ స్కూల్ పాఠశాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జనవరి 30 న నిరసన నాటకం ప్రదర్శించారు. దాంతో పాఠశాల హెడ్ ఫరీదా బేగం తోపాటు ఓ విద్యార్థిని తల్లి నజ్బున్నిసా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై దేశద్రోహం ఆరోపణలు నమోదయ్యాయి. శుక్రవారం జిల్లా జైలులో ఉన్న ఈ ఇద్దరు మహిళలను కలుసుకుని వారితో చర్చలు జరిపారు సిద్దరామయ్య.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories