పశుగ్రాసం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు..

పశుగ్రాసం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు..
x
Highlights

పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది..

పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది, కాని ఆయన జైలు నుండి బయటకు వచ్చే అవకాశం లేదు. వాస్తవానికి, పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన మూడు కేసులలో ఆయనకు విడిగా శిక్ష పడింది. ప్రస్తుతం రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. జైలు నుండి బయటకు రావడానికి మరొక కేసులో బెయిల్ రావలసి ఉంది.

కాగా 23 డిసెంబర్ 2017 న, డియోఘర్ ట్రెజరీ నుండి రూ .84.53 లక్షలను అక్రమంగా ఉపసంహరించుకున్నందుకు నేరంగా పరిగణించిన కోర్టు.. లాలూకు మూడున్నర సంవత్సరాల శిక్ష విధించింది. అలాగే 2018 మార్చి 24న, డుమ్కా ట్రెజరీ నుండి రూ .3.13 కోట్లు అక్రమంగా ఉపసంహరించుకున్న కేసులో మరో రెండేళ్లు.. ఇలా వేర్వేరు విభాగాలలో 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది, అదే సమయంలో 60 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు.

ఈ కేసులో 23 డిసెంబర్ 2017 నుండి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కు 2018 ఆరోగ్యం క్షీణించడంతో 17 మార్చి 2018 న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. చికిత్స కోసం ఆయనకు ఆరు వారాల బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత 30 ఆగస్టు 2018న లాలూను కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ అనారోగ్యం కారణంగా నుండి ఆయన రిమ్స్‌లోనే ఉన్నారు. లాలూ యాదవ్ ప్రస్తుతం రిమ్స్ డైరెక్టర్ బంగ్లాలో చికిత్స పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories