Heavy Rains: ఉత్తరాదిలో దంచికొడుతున్న భారీ వర్షాలు

Floods in Northern States due to Heavy Rains
x

ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Heavy Rains: ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వరదలు

Heavy Rains: భారీ వర్షాలకు ఉత్తర భారతం చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యాణా, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ ముంబైల్లో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. భారీ వర్షాలకుతోడు పలు హిల్ స్టేషన్లలో విరిగిపడుతున్న కొండచరియలు మరణమృదంగం మోగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ వర్షాలకు నిన్న ఒక్కరోజే 16మంది మరణించారు.

మరోవైపు మహారాష్ట్రలోని ఠాణెలో కల్వ ప్రాంతంలో కొండపై నుంచి దొర్లి వచ్చిన బండరాయి ఒక ఇంటిపై పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాయగఢ్‌ జిల్లాలో మరో ముగ్గురు వరదనీటిలో మునిగి మృతి చెందినట్లు తెలుస్తోంది. అటు ముంబైలో భారీ వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆర్థిక రాజధానిలో వరదల కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఉత్తరాఖండ్‌లో పరిస్థితి మరింత దయనీయంగా కనిపిస్తోంది. ఉత్తరకాశీలో వరదల కారణంగా ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటికే వరదలతో అతలాకుతలం అవుతున్న వేళ వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. రానున్న 72గంటల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయంది. ఆ రెండు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories