Delhi: ఢిల్లీ భజన్‌పురాలో కాల్పుల మోత.. ఒకరు మృతి

Firing in Delhi Bhajanpura One killed another injured
x

Delhi: ఢిల్లీ భజన్‌పురాలో కాల్పుల మోత.. ఒకరు మృతి

Highlights

Delhi: కాల్పుల్లో గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమం

Delhi: ఢిల్లీలోని భజన్‌పురా కాల్పుల మోతతో దద్దరిల్లింది.. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. విచక్షణా రహితంగా జరిపిన కాల్పులతో బుల్లెట్లు గోడల్లోకి దూసుకెళ్ళాయి. కాల్పులు జరిగిన పరిసరాలన్నీ భయానకంగా మారాయి. కాల్పుల మోతతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

కాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని హర్‌ప్రీత్‌ గిల్‌గా, గాయపడ్డ వ్యక్తిని సంజుగా గుర్తించారు. చనిపోయిన హర్‌ప్రీత్‌ గిల్‌ తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. సంజును ఆస్పత్రికి తరలించారు. అమెజాన్‌లో పనిచేసే ఇద్దరిపై కాల్పులు జరిపింది ఎవరు అన్నది తెలియలేదు.. మృతుడి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories