ఒరిస్సాలో మరో రైలు ప్రమాదం.. పూరీ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Fire in Durg-Puri Express in Odisha
x

ఒరిస్సాలో మరో రైలు ప్రమాదం.. పూరీ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Highlights

Odisha: AC కోచ్ బ్రేక్ ప్యాడ్‌లో చెలరేగిన మంటలు

Odisha: ఒరిస్సాలో మరో రైలు ప్రమాదం జరిగింది. పూరీ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్ AC కోచ్ బ్రేక్ ప్యాడ్‌లో మండలు చెలరేగాయి. నువాపాడా జిల్లాలోని ఖరియార్ రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బీ3 కోచ్‌లో అలారం చైన్ లాగిన తర్వాత బ్రేకులు విడుదల కాలేదని... బ్రేక్‌లు అసంపూర్తిగా విడుదల కావడం వల్లే మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. వెంటనే సమస్యను గుర్తించి చర్యలు చేపట్టారు. రాత్రి 11 గంటల తర్వాత రైలు బయలుదేరినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories