ఢిల్లీ అనాజ్‌మండీలో అగ్నిప్రమాదం.. 37 మంది మృతి

ఢిల్లీ అనాజ్‌మండీలో అగ్నిప్రమాదం.. 37 మంది మృతి
x
fire accident
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌మండీ ప్రాంతంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న...

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌మండీ ప్రాంతంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో తెలిసేలోపు, అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాద పరిస్ధితులు నెలకొన్నాయి.

స్కూల్‌బ్యాగులు, వాటర్‌ బాటిల్‌ తయారు చేసే చిన్న పరిశ్రమలో మంటలు ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. ప్రమాదసమయంలో 20 నుంచి 25 మంది కార్మికులు లోపలే నిద్రిస్తున్నట్లు ఫ్యాక్టరీ యాజమాని తెలిపారు. సడెన్‌గా చెలరేగిన మంటలు పక్కఇళ్లకు కూడా వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులుపెట్టారు.

మంటలు భారీగా వ్యాపించడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో పలువురు ఊపిరాడక 37 మంది ప్రాణాలు కొల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్ధానికులు 27 మందిని రక్షించారు. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.

ఇటు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మొత్తం 30 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. స్థానికులు, అధికారులు కలిసి.. 50 మంది వరకు సురక్షితంగా కాపాడారు.

చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హీటర్లు వేసుకుని నిద్రపోయారని.., ఓ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, మంటలు వ్యాపించగానే కొందరు భవనం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కొందరు టెర్రస్ పైనుంచి, భవనం కిటికీల నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories