ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం..

ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం..
x
Highlights

ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గోదాములో మంటలు రేగాయి.

ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గోదాములో మంటలు రేగాయి. తెల్లవారుజామున టిక్రీ బార్డర్ ప్రాంతం లోని గోదాములో ఈ ఘటన జరిగింది. స్థానికులు సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తోంది. 30 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి. గోదాములో బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు ఉన్న కారణంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చెలరేగిన మంటల కారణంగా .. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగతో అల్లుకుంది.

దీంతో స్థానికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరైనా లోపల ఉన్నారా అనేది ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఢిల్లీలో గతంలోనూ ఈ తరహా భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. పూర్తిగా మంటలు ఆర్పిన తర్వాత... ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనేది స్పష్టత వస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories