కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ
x
Highlights

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ కరోనా వ్యాప్తి లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ కరోనా వ్యాప్తి లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయి.అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయం దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో , ప్రజా ప్రతినిధుల జీతాల్లో కోత విధించాయి.

కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రమంత్రులు, ఎంపీలల జీతాలను తాత్కాలికంగా తగ్గించింది. రాష్ట్రపతి, గవర్నర్లు సైతం జీతాలను స్వచ్ఛందంగా జీతాలను తగ్గించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కేంద్రం తగ్గిస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ క్లారిటీ ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగల జీతాల్లో కోత విధించబోమని తెలిపింది. ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగి అయినా.. జీతంలో ఎలాంటి కోతలు ఉండవని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని ఉద్యోగులకు సూచించింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories