మహిళలపై లైంగిక దాడులు నిరోధించాలంటే.. సినీ నిర్మాత అసభ్యకర పోస్టింగ్

మహిళలపై లైంగిక దాడులు నిరోధించాలంటే.. సినీ నిర్మాత అసభ్యకర పోస్టింగ్
x
డేనియల్ శ్రావణ్‌
Highlights

దేశవ్యాప్తంగా దిశ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను ఉరి తీయాలని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా దిశ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను ఉరి తీయాలని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.సినీ ప్రముఖులు కూడా ఈ పాశవిక ఘటనకు ఖండిస్తూ నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాత అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. డేనియల్ శ్రావణ్‌ అనే నిర్మాత చేసిన పోస్టుపై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

డేనియల్ శ్రావణ్ ఓ సలహా ఇచ్చారు. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు కండోమ్ వెంట తీసుకెళ్లాలని, పురుషులకు కోరికను తీర్చాలని ఓ సలహా ఇచ్చారు. తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్టులో ఉన్న సారంశం ఏంటంటే '' మహిళలపై అత్యాచారం జరిగిన తర్వాత మరణాల సంఖ్యను ప్రభుత్వం తగ్గించాలి, దాని కోసం ఓ ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించాలి, మహిళలు ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన వారు లైంగిక విద్యపై అవగాహన కలిగి ఉండాలి. వారు కండోమ్ ను ఉపయోగించుకోవాలి, పురుషుల సెక్స్ కోరికను మన్నించాలి. పురుషుల లైంగిక కోరిక నెరవేరినప్పుడు చంపాలని ఆలోచన చేయరు. నిర్భయ చట్టం, పురుషులు రేపిస్టులుగా మారడానికి మహిళ తిరస్కరించడమే కారణమన్నారు. వారి కోరికను అత్యాచారాన్నిఅంగీకరించాలి అప్పుడు చంపాలనే ఆలోచన రాదు అని డేనియల్ తెలిపారు.

డేనియల్ శ్రావణ్‌ పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపడంతో అతను పోస్టును తొలిగించారు. దీని నెటిజన్లు సిరీస్ అయ్యారు. నీలాంటి వారికి ప్రభుత్వం ఉరి శిక్ష విధించాలని ఓ నెటిజన్ మండిపడ్డారు. నీ బుర్ర పని చేయడం లేదు నీకు వైద్య పరీక్షలు చేయించాలని మరో నెటిజన్ విమర్శలు చేశారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories