Top
logo

లక్నోలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్‌నాథ్ సింగ్

లక్నోలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్‌నాథ్ సింగ్
X
Highlights

ఏడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ప్రారంభమైంది, మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 51...

ఏడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ప్రారంభమైంది, మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 51 నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా దాదాపు 9 కోట్ల మంది ఓటర్లున్నారు. ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో 14, రాజస్తాన్‌లో 12, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌ల్లో చెరో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌ నియోజకవర్గంతోపాటు అనంత్‌నాగ్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లోనూ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 96 వేల పోలింగ్‌ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోర్‌ ఆయన సతీమణి గాయత్రి రాథోర్‌ జైపూర్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Next Story