FCI Jobs: భారీ జీతాలతో ఉద్యోగాలకు ఎఫ్‌సీఐ ఆహ్వానం

FCI Jobs: Food Corporation of India invites applications for 89 jobs
x

ఎఫ్‌సీఐ

Highlights

FCI Jobs: భారీ స్థాయిలో జీతాలతో ఎఫ్‌సీఐ దేశ‌వ్యాప్తంగా 89 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.

FCI Jobs: భారీ స్థాయిలో జీతాలతో భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశ‌వ్యాప్తంగా 89 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. మార్చి 31 న దరఖాస్తులకు ఆఖరితేది. మిగతా వివరాలకు https://fci.gov.in/ వెబ్‌సైట్‌ ను సంప్రదించవచ్చు.

ఖాళీలు: 89

1. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేషన్): 30 ఖాళీలు

అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ/ పీజీ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

వయస్సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

2. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్)‌: 27 ఖాళీలు

అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి క‌నీసం 55శాతం మార్కుల‌తో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ లేదా అగ్రిక‌ల్చ‌ర‌ల్ బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌.

వయస్సు: 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

3. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అకౌంట్స్)‌: 22 ఖాళీలు

అర్హ‌త‌: ఐసీఏఐ/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం క‌లిగి ఉండాలి.

వయస్సు: 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

4. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (లా): 8 ఖాళీలు

అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణ‌త‌. ఐదేండ్ల అనుభ‌వం ఉండాలి.

వయస్సు: 33 ఏళ్లు మించ‌కూడ‌దు.

5. మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 2 ఖాళీలు

అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తోపాటు ఇంట‌ర్న్‌షిష్ పూర్తిచేసి ఉండాలి. మూడేండ్ల‌ అనుభ‌వం ఉండాలి.

వయస్సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

పే స్కేల్‌: అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల‌కు రూ.60,000- రూ.1,80,000

మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు‌ల‌కు రూ.50,000- రూ.1,60,000

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు. రాత ప‌రీక్ష‌లో 50శాతం మార్కులు సాధించిన వారిని మాత్ర‌మే ఇంట‌ర్వ్యూకు పిలుస్తారు.

ప‌రీక్షా విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష మొత్తం 180 మార్కుల‌కు ఉంటుంది. ప‌రీక్షా స‌మ‌యం రెండున్న‌ర గంట‌లు.

అప్లి‌కేష‌న్ ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ/ అన్ని వర్గాల మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

చివ‌రి తేదీ: మార్చి 31, 2021

వెబ్‌సైట్‌: https://fci.gov.in/

Show Full Article
Print Article
Next Story
More Stories