హృదయవిదారకం : చనిపోయిన కొడుకుని చివరి చూపుకూడా చూడకుండా చేసిన లాక్ డౌన్..

హృదయవిదారకం : చనిపోయిన కొడుకుని చివరి చూపుకూడా చూడకుండా చేసిన లాక్ డౌన్..
x
Highlights

ఛత్తీస్ ఘడ్ లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.. విధినిర్వహణలో ఉన్న ఒక తండ్రి, చనిపోయిన తన కుమారుడిని చూడటానికి లాక్ డౌన్ అడ్డువచ్చింది.

ఛత్తీస్ ఘడ్ లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.. విధినిర్వహణలో ఉన్న ఒక తండ్రి, చనిపోయిన తన కుమారుడిని చూడటానికి లాక్ డౌన్ అడ్డువచ్చింది.ఛత్తీస్ ఘడ్ లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.. విధినిర్వహణలో ఉన్న ఒక తండ్రి, చనిపోయిన తన కుమారుడిని చూడటానికి లాక్ డౌన్ అడ్డువచ్చింది. దేశ సరిహద్దులో ఉన్న ఆ తండ్రి కొడుకు మరణాన్ని తట్టుకోలేక కనీసం ప్రత్యక్షంగా చివరి చూపు కూడా చూసుకోలేక తల్లడిల్లిపోయారు. దేశంలో నెలకొన్న లాక్డౌన్ ఆ తండ్రిని నిస్సహాయుడిని చేసింది. అతను తన అమాయక కొడుకు చివరి చూపును వీడియో కాలింగ్‌లో చూశాడు. అందులో తన కొడుకు మృతదేహాన్ని చూసి 'లవ్ యు సన్, నన్ను క్షమించు. నిన్ను చూడటానికి నేను రాలేను.' అంటూ వాపోయాడు.. ఇది చూసిన ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

దంతేవాడలోని ఘోట్‌ పాల్ గ్రామంలో నివసిస్తున్న రాజ్‌కుమార్ ఎస్‌ఎస్‌బిలో కానిస్టేబుల్. ఆయన ప్రస్తుతం నేపాల్ సరిహద్దులో డ్యూటీ చేస్తున్నారు. అతని కొడుకు ఆదిత్య గత కొన్ని నెలలుగా కణితి సమస్యలతో బాధపడుతున్నాడు. చాలా ఆసుపత్రులలో చికిత్స కూడా చేశారు. రాజ్‌కుమార్ తన కొడుకు చికిత్స కోసం జనవరిలో గ్రామానికి వచ్చాడు. పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి కూడా వచ్చారు. చికిత్స అనంతరం ఆదిత్య కోలుకున్నాడు.. అయితే అకస్మాత్తుగా పరిస్థితి మరింత దిగజారింది. బుధవారం ఆదిత్య పరిస్థితి మరింత విషమించింది. ఆసుపత్రికి తీసుకువెళ్లారు గురువారం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి బాలుడు మరణించాడు. ఈ విషయం శుక్రవారం రాజ్ కుమార్ కు తెలిసి తీవ్రంగా రోదించాడు.. కొడుకు చివరి చూపును చూసేందుకు రావాలని విపరీతంగా ప్రయత్నించాడు. కానీ దేశంలో నెలకొన్న పరిస్థితులతో రాలేకపోయాడు. దాంతో తన కొడుకు చివరి చూపును వీడియో కాల్ ద్వారా చూశాడు.. ఇక్కడ మరో విషాదకర విషయం ఏమిటంటే ఆ వీడియో కాలింగ్ లో కూడా నెట్వర్క్ సరిగా లేక అంతంతమాత్రమే కనిపించింది.

ఘటనపై స్పందించిన రాజ్ కుమార్ ఓ వెబ్సైటు ద్వారా తన బాధను పంచుకున్నారు.. అందులో 'చిన్నారి మరణ వార్త విన్న తరువాత నేను అధికారులకు సమాచారం ఇచ్చాను. అందరూ విచారం వ్యక్తం చేశారు.. కానీ పంపించలేదు. కొందరు మాత్రం ప్రయత్నించారు, కాని లాక్డౌన్ కారణంగా అది సాధ్యం కాలేదు. అటువంటి పరిస్థితిలో, నేను చివరిసారిగా కొడుకును చూడలేకపోయాను. నా జీవితాంతం నేను దీన్ని మరచిపోలేను. పరిస్థితి సాధారణమైన వెంటనే నేను కుటుంబానికి కలుస్తాను. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, ఈసారి కొడుకు నాతో ఉండడు.' అని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories