జనవరి 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి

జనవరి 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి
x
Highlights

* ట్యాగ్ లేకుండా గేటు దాటితే రెట్టింపు వడ్డింపు * అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ * టోల్ ప్లాజాలా వద్ద నగదు రహిత ప్రయాణం

వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి వాహనదారులపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఉంటేనే టోల్ ప్లాజాల దగ్గర అనుమతి ఇస్తారంటూ కేంద్రం ప్రకటించింది. ట్యాగ్ లేకుండా గేటు దాటితే రెట్టింపు వడ్డించేందుకు రెడీ అవుతున్నారు. ఫాస్టాగ్ ఉపయోగించడం ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్ర రవాణా శాఖ నిబంధనలను కఠినం చేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ రహదారులపై ప్రయాణించే అన్ని రకాల వాహనాలకు ఫాస్టాగ్ నిబంధన వర్తించేలా చర్యలు చేపట్టింది. టోల్ ప్లాజాల దగ్గర వాహనదారుల నుంచి చెల్లింపులను కొత్త సంవత్సరం నుంచి ఫాస్టాగ్ ద్వారా జరపాలని నిర్ణయం తీసుకుంది.

జనవరి 1, 2021 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్ట్ ట్యాగ్‌ను ఉపయోగించడం ద్వారా ప్రయాణికులు తమ సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చుని, అలాగే నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని కేంద్రం ప్రకటించింది.

అంతకు ముందు, డిసెంబర్ 2017 నుంచి దేశంలో విక్రయించే నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫాస్ట్ ట్యాగ్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 1, 2021 నుంచి కొత్త థర్డ్ పార్టీ వాహన బీమా పొందటానికి ఫాస్ట్ ట్యాగ్‌ వినియోగాన్ని రవాణా మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది.

ఫాస్టాగ్‌తో ఎలాంటి ఇబ్బందులు, మోసాలకు ఆస్కారం ఉండదని టోల్ నిర్వహకులు అంటున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా నగదు రహిత సేవలు అందించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. సమయం ఇంధనం ఆదా అవుతుందని అవగాహన కల్పిస్తారు.

ప్రభుత్వం మంచి లక్ష్యంతో తీసుకొచ్చిన ఫాస్టాగ్, అర్ధరాత్రి నుంచి ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి కొద్ది రోజుల గడువు పెంచాలని వాహనదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories