ఢిల్లీలో 17వ రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

ఢిల్లీలో 17వ రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
x
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ.. ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా రహదారులు దిగ్బంధించాలని రైతు సంఘాలు నిర్ణయించుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ.. ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా రహదారులు దిగ్బంధించాలని రైతు సంఘాలు నిర్ణయించుకున్నాయి. దేశవ్యాప్తంగా టోల్‌గేట్ల దగ్గర రుసుము చెల్లించకుండా నిరసన తెలపాలని పిలుపునిచ్చాయి. 14న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.

ఎముకలు కొరికేసే చలిలో ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో రైతుల ఆందోళన.. రోజు రోజుకు మద్దతు గూడబెట్టుకుంటోంది. తాజాగా అమృత్‌సర్‌లోని కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ సభ్యులు, సమాజ్‌వాదీ పార్టీ మద్దతు పలికాయి. కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ సభ్యులు 7 వందల ట్రాక్టర్లతో రాజధానికి చేరుకున్నారు.

చర్చలకు రావాలని ఓ వైపు కేంద్రం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదలను రైతులు తిరస్కరిస్తున్నారు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. త్వరలో రైలు రోకోలు కూడా చేపట్టాలని రైతులు భావిస్తున్నారు. మరోవైపు.. కొత్త చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెబుతున్నారు ప్రధాని మోడీ. ఈ చట్టాలతో రైతుల ఆదాయం పెరిగి ఆర్థికంగా బలపడతారని హామీ ఇస్తున్నారు. అన్నదాతలకు ఎలాంటి హాని జరగదని భరోసా కల్పిస్తున్నారు. అయినప్పటికీ.. రైతులు మాత్రం తమ ఆందోళనలు విరమించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories