Tamil Nadu: తమిళనాడులో రైతుల ఆందోళన.. కుప్పం పర్యటనలో సీఎం వ్యాఖ్యలపై నిరసన

Farmers Agitation in Tamil Nadu
x

Tamil Nadu: తమిళనాడులో రైతుల ఆందోళన.. కుప్పం పర్యటనలో సీఎం వ్యాఖ్యలపై నిరసన

Highlights

Tamil Nadu: పాలారు నదిపై చెక్‌డ్యాం నిర్మిస్తామన్న సీఎం జగన్‌

Tamil Nadu: తమిళనాడులో పాలారు జలవివాదం ముదురుతోంది. కుప్పం పర్యటనలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తమిళనాడు రైతు సంఘం మండిపడుతోంది. తిరుపత్తూరు కలెక్టరేట్ దగ్గర రైతు సంఘం నేతలు సీఎం జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పాలారు నదిపై చెక్‌డ్యాం నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పడంతో.. తమ హక్కుల్ని హరించొద్దని కోరుతున్నారు రైతులు.

ఇప్పటికే ఏపీ పాలారు నదిపై 22 చెక్‌డ్యాంలు నిర్మించిందని.. మరో చెక్ డ్యాం నిర్మిస్తే తమ రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని తమిళనాడు రైతు సంఘం చెబుతోంది. కర్ణాటక, ఏపీ కంటే పాలారు నది తమ రాష్ట్రంలోనే అధికంగా ప్రవహిస్తుందని.. తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట జిల్లాలకు పాలారు నది జీవనాధారమని అంటున్నారు. ఏపీ చెక్‌ డ్యాం నిర్మిస్తే తమకు కరువు బారిన పడతామంటున్నారు. చెక్ డ్యాం కట్టాలని ఏపీ చూస్తే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories