షాకింగ్: ఏసీ పైపులో 40 పాము పిల్లలు

షాకింగ్: ఏసీ పైపులో 40 పాము పిల్లలు
x
Highlights

ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏసీ పైపులో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 40 పాము పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. మీరట్ జిల్లాలోని ఒక...

ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏసీ పైపులో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 40 పాము పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. మీరట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఎయిర్ కండీషనర్ నుండి పాములు బయటపడి, ఆ ప్రాంతంలో భయాన్ని సృష్టించాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి కంకర్‌ఖేరా పోలీసు సర్కిల్ పరిధిలోని పావ్లీ ఖుర్ద్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. శ్రద్ధానంద్ అనే రైతు తన గదిలో నేలమీద పాకుతున్న పాము పిల్లను చూశాడు. దేంతో రెండవ ఆలోచన లేకుండా, ఆ సరీసృపాన్ని ఎత్తుకొని బయట వదిలేశాడు. కొద్దిసేపటి తరువాత, అతను నిద్రించడానికి మళ్ళీ తన గదిలోకి వెళ్ళినప్పుడు, మంచం మీద మరో మూడు పాము పాములను చూశాడు. వాటిని తీసి బయట వదేలేయ్యకముందే గదిలోని ఎయిర్ కండీషనర్ నుండి మరికొన్ని పాములు జారడం చూశాడు.

దాంతో కుటుంబ సభ్యుల సహాయంతో ఎయిర్ కండీషనర్ కవర్ తీసివేసి చూడగా పైపులో 40 పాములను చూసి షాక్ అయ్యారు. ఈ వార్త వ్యాపించడంతో, స్థానిక ప్రజలు పిల్ల పాములను చూడటానికి శ్రద్ధానంద్ ఇంటి వద్ద గుమిగూడారు. స్థానికుల సహాయంతో, శ్రద్ధానంద్ ఆ పాములన్నింటినీ ఒక సంచిలో ఉంచి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. గత కొన్ని నెలలుగా ఎయిర్ కండీషనర్ వాడటం లేదని.. కాబట్టి, ఒక పాము పైపులో గుడ్లు పెట్టి ఉండవచ్చని.. ఈ క్రమంలోనే పాము పిల్లలు బయటికి వచ్చాయని స్థానిక పశువైద్య వైద్యుడు డాక్టర్ ఆర్కె వత్సల్ భావించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories